భార‌త్, పాక్‌ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ టికెట్లు ఇచ్చేది ఎప్పటి నుంచి అంటే..?

India Vs Pakistan World Cup Match Ticket Sales To Start From September - Sakshi

క్రికెట్‌ అభిమానులకు ఐసీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వన్డే వరల్డ్‌కప్‌-2023 టికెట్ల విక్రయానికి సంబంధించిన తేదీలను ఇవాళ (ఆగస్ట్‌ 15) ప్రకటించింది. దశలవారీగా జరిగే టిక్కెట్ల విక్రయ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ దశ ఇదివరకే ప్రారంభం కాగా, ఆగస్టు 25 నుంచి టిక్కెట్ల కొనుగోలు దశ ప్రారంభమవుతుందని వెల్లడించింది. వరల్డ్‌కప్‌ మొత్తంలో అత్యంత ఆసక్తికరమైన దాయాదాల సమరానికి సంబంధించిన టికెట్ల విక్రయం సెప్టెంబ‌ర్ 3 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది.

టికెట్ల అమ్మకాల ప్రారంభ తేదీల వివరాలు.. ఏయే మ్యాచ్‌లు..

  • ఆగస్ట్‌ 25: నాన్-ఇండియా వార్మప్ మ్యాచ్‌లు మరియు అన్ని నాన్-ఇండియా ఈవెంట్ మ్యాచ్‌లు
  • ఆగ‌స్టు 30: గౌహతి, త్రివేండ్రంలలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు
  • ఆగ‌స్టు 31: చెన్నై, ఢిల్లీ, పూణేలలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు
  • సెప్టెంబ‌ర్ 1: ధ‌ర్మ‌శాల‌, ల‌క్నో, ముంబైలలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు
  • సెప్టెంబ‌ర్ 2: బెంగ‌ళూరు, కోల్‌క‌తాలలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు
  • సెప్టెంబ‌ర్ 3: అహ్మదాబాద్‌లో టీమిండియా ఆడే మ్యాచ్‌ (భార‌త్ వర్సెస్‌ పాకిస్థాన్, అక్టోబ‌ర్ 14) 
  • సెప్టెంబ‌ర్ 15: సెమీఫైన‌ల్స్, ఫైన‌ల్ మ్యాచ్‌ల టికెట్లు

కాగా, ఆగ‌స్ట్‌ 15 నుంచి www.cricketworldcup.com వెబ్‌సైట్‌లో వ‌ర‌ల్డ్ క‌ప్ అప్‌డేట్స్ గురించి తెలుసుకోవ‌చ్చ‌ని ఐసీసీ తెలిపింది. అక్టోబ‌ర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో ప్ర‌పంచ క‌ప్ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీలో  టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో(అక్టోబ‌ర్ 8న) ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థులైన భార‌త్, పాకిస్థాన్ జట్ల మ్యాచ్‌ అహ్మ‌దాబాద్ వేదిక‌గా అక్టోబ‌ర్ 14న జరుగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top