
ఆస్ట్రేలియా టూర్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. భారత జట్టు వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను సెలక్టర్లు తప్పించారు. అతడి స్ధానంలో శుభ్‌మన్ గిల్‌ను కొత్త వన్డే కెప్టెన్‌గా నియమించారు. గత కొన్నేళ్లుగా భారత వన్డే జట్టును నడిపిస్తున్న రోహిత్ శర్మ ఇకపై కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు.
అతడితో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి కూడా వన్డే జట్టులో చోటు దక్కింది. కాగా ఆస్ట్రేలియా పర్యటనకు స్టార్ ప్లేయర్లు హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్ గాయాల కారణంగా దూరమయ్యారు. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన పంత్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు.
అదేవిధంగా యూఏఈ వేదికగా జరిగిన ఆసియాకప్‌లో గాయపడ్డ హార్ధిక్ పూర్తిగా కోలుకోవడానికి మరో నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. హార్ధిక్ పాండ్యా స్ధానంలో యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. నితీష్ గత కొన్నాళ్లగా కేవలం టెస్టు జట్టులో మాత్రమే కొనసాగుతున్నాడు. కానీ హార్దిక్ గాయం పడడంతో నితీష్‌కు జాక్ పాట్ తగిలింది. పంత్ స్ధానంలో ధ్రువ్ జురెల్ ఎంపికయ్యాడు.
బుమ్రాకు విశ్రాంతి..
కాగా ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. మహ్మద్ సిరాజ్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. పేస్ బౌలింగ్ ఎటాక్‌ను సిరాజ్ లీడ్ చేయనున్నాడు. అతడితో పాటు యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణలు బంతిని పంచుకోనున్నారు.
స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకున్నారు. ఇక టీ20 జట్టులో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. కెప్టెన్‌గా సూర్య కొనసాగుతుండగా.. నితీష్, సుందర్ కొత్తగా జట్టులోకి వచ్చారు. ఆక్టోబర్ 19 నుంచి భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్
చదవండి: BCCI: రోహిత్ శర్మకు భారీ షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్