
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ(Rohit sharma) స్ధానంలో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను అజిత్ అగార్కర్ అండ్ కో నియమించింది. ఆస్ట్రేలియా టూర్‌కు భారత జట్టు ఎంపిక సందర్భంగా ఈ నిర్ణయాన్ని సెలక్టర్లు తీసుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు వన్డే జట్టులో సభ్యులుగా కొనసాగనున్నారు.
2027 వన్డే ప్రపంచ కప్ దృష్ట్యా రోహిత్ శర్మ స్ధానంలో కెప్టెన్‌గా గిల్‌ను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచ కప్‌కు ఇంకా రెండేళ్ల కంటే ఎక్కువ సమయం ఉండడంతో అప్పటివరకు రోహిత్ ఆడుతాడో లేదో స్పష్టత లేనందున భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
ముగిసిన రోహిత్ శకం..
భారత క్రికెట్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ శకం ముగిసింది. ఇప్పటికే టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు వన్డే కెప్టెన్సీ కోల్పోయాడు. దీంతో ఆసీస్ సిరీస్‌లో అతడిని కెప్టెన్‌గా చూడాలనకున్న అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది.
వన్డేల్లో భారత సారథిగా రోహిత్‌కు అద్భతమైన ట్రాక్ రికార్డు ఉంది. టీమిండియాకు కెప్టెన్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. వన్డేల్లో 50పైగా మ్యాచ్‌లలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఏడుగురులో ఒకడిగా రోహిత్ నిలిచాడు. వన్డేల్లో 75% విజయ శాతంతో అత్యుత్తమ కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు.
ఇది ఎంఎస్ ధోని, గంగూలీ, కోహ్లి వంటి దిగ్గజ కెప్టెన్‌లకు కూడా సాధ్యం కాలేదు. అదేవిధంగా అతడి సారథ్యంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను భారత్ సొంతం చేసుకుంది. అదేవిధంగా వన్డే ప్రపంచకప్-2023 రన్నరప్‌గా భారత్‌ను హిట్‌మ్యాన్ నిలిపాడు.
ఈ టోర్నీ అసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు తుది మొట్టుపై బోల్తా పడింది. మొత్తం 56 వన్డేల్లో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్.. 42 మ్యాచ్‌ల్లో విజయాలను అందించాడు. అతడి కెప్టెన్సీలో భారత్ కేవలం 12 వన్డేల్లో మాత్రం ఓటమి పాలైంది.
పంత్ దూరం..
కాగా ఆస్ట్రేలియా టూర్‌కు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యారు. హార్దిక్ పాండ్యా స్ధానంలో నితీష్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకోగా.. పంత్ స్ధానంలో ధ్రువ్ జురెల్ వన్డే జట్టులోకి వచ్చాడు. ఆసీస్‌తో వన్డేలకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు.
ఆసీస్ టూర్‌కు భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ , అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, విరాట్ కోహ్లి
భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్