
ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు బెకెన్‌హామ్‌లో తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. గురువారం తొలి ప్రాక్టీస్ సెషన్‌లో గిల్ సేన తీవ్రంగా శ్రమించింది. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్‌కు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూరమయ్యాడు.
లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో పంత్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ సబ్‌స్ట్యూట్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్న పంత్.. రెండు ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు మాత్రం వచ్చాడు.
తీవ్రమైన నొప్పితో బాధపడుతూనే బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో నాలుగో టెస్టుకు పంత్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. తాజాగా పంత్ గాయంపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్‌డెష్కాట్ అప్‌డేట్ ఇచ్చాడు. పంత్ ఇంకా నొప్పితో బాధపడుతున్నాడని, మాంచెస్టర్ టెస్ట్ సమయానికి ఫిట్‌నెస్ సాధిస్తాడని టెన్‌డెష్కాట్ థీమా వ్యక్తం చేశాడు.
"మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్టుకు ముందు పంత్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను మొదలు పెడతాడు. ఆ సమయానికి అతడు కచ్చితంగా ఫిట్‌నెస్ సాధిస్తాడన్న నమ్మకం ఉంది. అతడు మూడో టెస్టులో చాలా నొప్పితో బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత అతడి చేతి వేలి నొప్పి కాస్త తగ్గింది.
కానీ ముందుస్తు జాగ్రత్తగా ప్రస్తుతం అతడు ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాడు. వికెట్ కీపింగ్ చేయగలడా లేదా అన్నది ఆఖరిలో మేము నిర్ధారించుకుంటాము. మరోసారి ఇన్నింగ్స్ మధ్యలో కీపర్‌ను మార్చాల్సిన పరిస్థితి రాకూడదు. పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే పంత్‌నే బ్యాటింగ్, వికెట్ కీపింగ్ రెండూ చేస్తాడు. రాబోయే రోజుల్లో అతడి ఫిట్‌నెస్‌పై కచ్చితంగా అప్‌డేట్ ఇస్తామని" విలేకరుల సమావేశంలో డెష్కాట్ పేర్కొన్నాడు.
చదవండి: ENG vs IND: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. టీమిండియాకు భారీ షాక్