
లార్డ్స్ టెస్టులో హార్ట్ బ్రేకింగ్ ఓటమి తర్వాత ఆతిథ్య ఇంగ్లండ్‌తో మరో రసవత్తర పోరుకు టీమిండియా సిద్దమైంది. మాంచెస్టర్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా తమ సన్నాహాకాలను ప్రారంభించింది. గురువారం ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం నెట్స్‌లో భారత ఆటగాళ్లు చెమటోడ్చారు.
అర్ష్‌దీప్‌కు గాయం..!
అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చేతి వేలికి గాయమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్‌లో పేర్కొంది. బంతి చేతి వేలికి తాకడంతో రక్తం కూడా వచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో అతడి చేతి వేలికి ఫిజియో టేప్ వేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్‌డెష్కాట్ కూడా ధ్రువీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్.. టెస్టుల్లో మాత్రం ఇంకా భారత్ తరపున ఆడలేదు.
ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికైనప్పటికి తొలి మూడు టెస్టులకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఒకవేళ నాలుగో టెస్టుకు జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇస్తే.. అర్ష్‌దీప్‌కు తుది జట్టులోకి చోటు దక్కే అవకాశముంది. కానీ ఇంతలోనే అర్ష్‌దీప్ గాయపడడం టీమ్‌మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. మరోవైపు లార్డ్స్ టెస్టులో గాయపడిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఫిట్‌నెస్‌పై ఇంకా క్లారిటీ లేదు.
చదవండి: సిరాజ్ 3 సిక్సర్లతో గెలిపిస్తాడని అనుకున్నా!.. జోకులు ఆపండి: అశ్విన్