India Pacer Jasprit Bumrah Bowls In Nets Ahead Of Ireland T20Is; See Video - Sakshi
Sakshi News home page

IND VS IRE T20 Series 2023: పట్టాలెక్కిన బుమ్రా ఎక్స్‌ప్రెస్‌.. పేసు గుర్రాన్ని ఎదుర్కోలేక వణికిపోయిన బ్యాటర్లు 

Aug 16 2023 6:10 PM | Updated on Aug 16 2023 7:09 PM

IND VS IRE T20 Series 2023: Bumrah Dropping Batters In Nets - Sakshi

3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడేందుకు టీమిండియా ఐర్లాండ్‌కు చేరుకుంది. ఆగస్ట్‌ 18, 20, 23 తేదీల్లో జరిగే ఈ సిరీస్‌ కోసం భారత ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. చిన్న జట్టే కదా తేలికగా తీసుకోకుండా భారత ఆటగాళ్లు నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ ఇవాళ (ఆగస్ట్‌ 16) జట్టు కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు చెందిన ఓ వీడియోను సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది.

ఇందులో బుమ్రా నెట్స్‌లో చమటోడుస్తూ కనిపించాడు. మునుపటి వేగాన్ని దొరకబుచ్చుకున్న అతను నిప్పులు చెరిగే వేగంతో బంతులను సంధించాడు. పేసు గుర్రాన్ని ఎదుర్కోలేక బ్యాటర్లు వణిపోయారు. బుమ్రా పేస్‌కు వారి దగ్గర సమాధానం కనిపించలేదు. దాదాపు ఏడాదిగా బంతి పట్టని బుమ్రా తిరిగి లయను అందుకోవడంతో బీసీసీఐ ఆనందం వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించిన వీడియోను భారత క్రికెట్‌ అభిమానులతో పంచుకుంది.

మనందరం ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది.. అతని గురించి అందరికీ తెలిసిందే అంటూ క్యాప్షన్‌ జోడించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియోతో పాటు మరో వీడియో కూడా నెట్టింట్లో సందడి చేస్తుంది. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన భారత స్టార్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌కు సంబంధించిన ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

ఈ వీడియోలో పంత్‌ యాక్సిడెంట్‌ తర్వాత తొలిసారి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. కొద్ది రోజుల కిందట కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ల బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ వీడియో కూడా ఇలాగే వైరలయ్యింది. గాయాల బారిన పడి గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న సీనియర్లు తిరిగి బరిలో కనిపించడంతో భారత క్రికెట్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా వన్డే వరల్డ్‌కప్‌ సమయానికి జట్టులో చేరి భారత్‌ను జగజ్జేతగా నిలపాలని వారు ఆకాంక్షిస్తున్నారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement