
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. గురువారం(జూలై 10) నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో ఆధిక్యం పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. అందుకు తగ్గట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. అయితే బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో భారత జట్టుతో పాటు ఓ ప్రత్యేక ఆతిథి కసరత్తలు చేస్తూ కన్పించాడు.
ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక కానప్పటికి నెట్స్‌లో జట్టుకు తన సేవలను అందించాడు. అతడే టీమిండియా, ముంబై ఇడియన్స్ స్టార్ పేసర్ దీపక్ చాహర్. ప్రస్తుతం జరుగుతున్న వింబుల్డన్ టోర్నమెంట్‌ను వీక్షించేందుకు చాహర్ తన భార్యతో కలిసి లండన్‌కు వెళ్లాడు.
ఈ క్రమంలో లండన్‌లో ఉన్న భారత జట్టుతో చాహర్ కలిశాడు. ఈ రాజస్తాన్ పేసర్ జట్టుతో కలవడమే కాకుండా నెట్స్‌లో భారత బ్యాటర్లకు బౌలింగ్ చేశాడు. సాధరణంగా దీపక్ చాహర్ కొత్త బంతిని అద్బుతంగా స్వింగ్ చేయగలడు. ఈ క్రమంలో లార్డ్స్ మైదానంలో బంతి ఎక్కువగా స్వింగ్ అయ్యే అవకాశమున్నందన.. చాహర్ బౌలింగ్‌లో భారత బ్యాటర్లు ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకుముందు బర్మింగ్‌హామ్ టెస్టు సందర్భంగా పంజాబ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ భారత నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో కన్పించి ఆశ్చర్చపరిచాడు. ఇప్పుడు చాహర్ నెట్‌బౌలర్‌గా మరి అందరికి షాకిచ్చాడు. దీపక్ చాహర్ చివరగా 2023 డిసెంబర్‌లో భారత తరపున ఆడాడు. వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన చాహర్.. టెస్టుల్లో మాత్రం ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ఇంగ్లండ్ తుది జట్టు..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ మరియు షోయబ్ బషీర్.
భారత తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్
Deepak Chahar trains with Team India at Lord’s ahead of the third Test match.
[ Rahul Rawat ] pic.twitter.com/bqnASrkAJU— Jay Cricket. (@Jay_Cricket12) July 9, 2025