
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టును డ్రా ముగించిన భారత జట్టు.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. లండన్‌లోని ఓవల్ వేదికగా జూలై 31 నుంచి ప్రారంభం కానున్న ఆఖరి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని గిల్ సేన భావిస్తోంది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే ఆఖరి టెస్టుకు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దూరం కాగా.. ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై అనుమానాలు నెలకొన్నాయి. మాంచెస్టర్ టెస్టులో బుమ్రా ఫుల్ ఫిట్‌నెస్‌గా కన్పించలేదు. ఈ మ్యాచ్‌లో ఎక్కువ వేగంతో కూడా జస్ప్రీత్ బౌలింగ్ చేయలేకపోయాడు.
ఈ స్టార్ పేసర్ 100కు పైగా పరుగులు సమర్పించుకుని కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. మరోవైపు గాయం కారణంగా నాలుగో టెస్టుకు దూరమైన పేసర్ ఆకాష్ దీప్ ఫిట్‌నెస్‌పై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. అయితే కీలకమైన ఐదో టెస్టులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది.
శార్ధూల్ పై వేటు..!
వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్ధానంలో ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. పంత్‌కు ప్రత్నమయ్నాంగా తమిళనాడు వికెట్ కీపర్ జగదీశన్ నారాయణ్‌ను సెలక్టర్లు ఎంపిక చేసినప్పటికి.. అనుభవం దృష్ట్యా జురెల్ వైపే మెనెజ్‌మెంట్ ఆసక్తి చూపే అవకాశముంది.
అంతేకాకుండా నాలుగో టెస్టులో బంతితో విఫలమైన ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్‌పై కూడా వేటు పడే ఛాన్స్ ఉంది. అతడి స్ధానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అరంగేట్రంలో తీవ్ర నిరాశపరిచిన పేసర్ అన్షుల్ కాంబోజ్‌ను కూడా ఓవల్ టెస్టుకు పక్కన పెట్టనున్నట్లు సమాచారం.
అతడి స్ధానంలో ఆకాష్ దీప్(ఫిట్‌నెస్‌కు లోబడి) లేదా ప్రసిద్ద్ కృష్ణకు అవకాశమివ్వాలని గంభీర్ అండ్ కో భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బుమ్రాకు ఆఖరి టెస్టులో ఆడిస్తారా లేదా విశ్రాంతి ఇస్తారా అన్నది ఇప్పుడు ప్రశార్ధకంగా మారింది. మరోవైపు ఇంగ్లండ్ ఐదో టెస్టుకు తమ జట్టును ప్రకటించింది. బౌలింగ్ ఆల్‌రౌండర్ జేమి ఓవర్టన్‌కు తిరిగి మళ్లీ ఇంగ్లీష్ జట్టు సెలక్టర్లు పిలుపునిచ్చారు.
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు భారత తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్
చదవండి: వారిద్దరూ అద్బుతం.. మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: శుబ్‌మన్ గిల్