
ఆసియాకప్-2025 కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నాయకత్వం వహించనున్నాడు. సెప్టెంబర్ 9న అబుదాబిలో జరిగే టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో అఫ్గానిస్తాన్ తలపడనుంది.
ఈ టోర్నీ ఆరంభానికి ముందు అఫ్గాన్ జట్టు.. యూఏఈ, పాకిస్తాన్‌తో టై-సిరీస్ ఆడనుంది. ఆసియాకప్ సన్నాహాకాల్లో భాగంగా ఈ మక్కోణపు సిరీస్‌ను ప్లాన్ చేశారు. ఇంతకముందే ఆగస్టు 5న ఆసియాకప్ కోసం అఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) 22 మంది సభ్యుల ప్రాథమిక జట్టును ప్రకటించింది.
ఇప్పుడు అందులో నుంచి 17 మంది పేర్లను ఏసీబీ ఖరారు చేసింది. రషీద్ ఖాన్ డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ వ్యవహరించనున్నాడు. ఆసియాకప్ ఎంపికైన జట్టులో చాలా మంది ఆటగాళ్లు ట్రై-సిరీస్‌లో పాల్గొంటారని ఏసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ట్రై-సిరీస్ ఆగస్టు 29న ప్రారంభమై, సెప్టెంబర్ 7న ముగియనుంది.
ఆసియాకప్-2025కు అఫ్గాన్ జట్టు ఇదే
రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రహమాన్, అల్లాహ్ గజన్ఫార్. నూర్ అహ్మద్, ఫారిక్ అహ్మద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీ
రిజర్వ్ ఆటగాళ్లు: వఫివుల్లా తారఖాల్, నంగ్యాల్ ఖరోటే, అబ్దుల్లా అహ్మద్‌జాయ్
ఆసియాకప్‌లో అఫ్గాన్ షెడ్యూల్
అఫ్గానిస్తాన్ వర్సెస్ హాంకాంగ్- సెప్టెంబర్ 9 షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి
అఫ్గానిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ -సెప్టెంబర్ 16 షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి
అఫ్గానిస్తాన్ వర్సెస్ శ్రీలంక -సెప్టెంబర్ 18 షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి
చదవండి: Asia Cup 2025: పాపం శ్రేయస్ అయ్యర్.. అందుకోసం కెప్టెన్సీని కూడా వదిలేశాడు!?