
ఆసియాకప్-2025కు భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఇప్పుడు దులీప్ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ దేశవాళీ టోర్నీ కోసం వెస్ట్ జోన్ జట్టులో అయ్యర్ సభ్యునిగా ఉన్నాడు. శార్ధూల్ ఠాకూర్ కెప్టెన్సీలో శ్రేయస్ ఆడనున్నాడు.
అయితే దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ కెప్టెన్‌గా తొలుత శ్రేయస్ అయ్యర్‌ను శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయాలని భావించరంట. కానీ కెప్టెన్సీ ఆఫర్‌ను శ్రేయస్ తిరష్కరించినట్లు తెలుస్తోంది. దీంతో అతడి స్ధానంలో శార్ధూల్‌ను కెప్టెన్‌గా నియమించారు.
కాగా పలు రిపోర్ట్‌లు ప్రకారం.. ఆసియాకప్ కోసం భారత జట్టులో తనకు చోటు దక్కుతుందని భావించి వెస్ట్ జోన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి నిరకారించినట్లు సమాచారం. కానీ దురదృష్టవశాస్తూ సెలక్టర్లు ఆసియాకప్‌నకు అతడిని ఎంపిక చేయలేదు. ఈ ఖండాంత టోర్నీకి ప్రకటించిన 15 మంది సభ్యల భారత జట్టులో అయ్యర్ ఛాన్స్ లభించలేదు. కానీ రిజర్వ్ జాబితాలో కూడా చోటు దక్కలేదు.
"వెస్ట్ జోన్ సెలక్షన్ కమిటీ ఇచ్చిన కెప్టెన్సీ ఆఫర్‌ను శ్రేయస్ అయ్యర్ తిరస్కరించాడన్నది నిజమే. ఆ తర్వాతే ముంబై చీఫ్ సెలక్టర్ అయిన కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్, వెస్ట్ జోన్ జట్టుకు నాయకత్వం వహించమని శార్ధూల్ ఠాకూర్‌ను అడిగారు. అందుకు అతడు అంగీకరించాడు" అని ముంబై క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
అంతేకాకుండా ఆసియాకప్ జట్టులో చోటు దక్కుతుందని ఊహించి అయ్యర్ ప్రవీణ్ ఆమ్రేతో కలిసి వైట్-బాల్ సన్నాహాలను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. కానీ అజిత్ అగార్కర్ అండ్ కో మాత్రం అతడిపై వేటు వేసి ఊహించని షాకిచ్చారు.
దులీప్ ట్రోఫీకి వెస్ట్ జోన్ జట్టు: శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఆర్య దేశాయ్, హార్విక్ దేశాయ్ (వికెట్-కీపర్), శ్రేయాస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, జయమీత్ పటేల్, మనన్ హింగ్రాజియా, సౌరభ్ నవలే (వికెట్-కీపర్), శంసుష్ ములాని, శంసుష్ ములాని, శంసుష్ ములాని, ధర్మన్ జా దేశ్‌పాండే, అర్జన్ నాగ్వాస్వాలా
ఆసియా కప్-2025 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.