బ్రాడ్‌మన్‌ రికార్డుపై కన్నేసిన విరాట్‌ కోహ్లి | IND VS AUS 2nd Test: Virat Kohli Eyes Donald Bradman MASSIVE Record | Sakshi
Sakshi News home page

బ్రాడ్‌మన్‌ రికార్డుపై కన్నేసిన విరాట్‌ కోహ్లి

Dec 4 2024 8:33 PM | Updated on Dec 4 2024 8:33 PM

IND VS AUS 2nd Test: Virat Kohli Eyes Donald Bradman MASSIVE Record

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి క్రికెట్‌ దిగ్గజం సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ పేరిట ఉన్న ఓ ఆల్‌టైమ్‌ రికార్డుపై కన్నేశాడు. అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే రెండో టెస్ట్‌లో విరాట్‌ మరో రెండు సెంచరీలు చేస్తే.. ఏ జట్టుపై అయినా విదేశాల్లో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. 

బ్రాడ్‌మన్‌ 1930-1948 మధ్యలో ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌పై 11 సెంచరీలు చేయగా.. విరాట్‌ 2011-2024 మధ్యలో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై 10 సెంచరీలు చేశాడు. అడిలైడ్‌ టెస్ట్‌లో విరాట్‌ మరో రెండు సెంచరీలు చేస్తే బ్రాడ్‌మన్‌ రికార్డు బద్దలవుతుంది.

బ్రాడ్‌మన్‌- ఇంగ్లండ్‌పై 11 సెంచరీలు
విరాట్‌ కోహ్లి- ఆస్ట్రేలియాపై 10 సెంచరీలు
జాక్‌ హాబ్స్‌- ఆస్ట్రేలియాపై 9 సెంచరీలు
సచిన్‌ టెండూల్కర్‌- శ్రీలంకపై 9 సెంచరీలు
వివియన్‌ రిచర్డ్స్‌- ఇంగ్లండ్‌పై 8 సెంచరీలు
సునీల్‌ గవాస్కర్‌- ఇంగ్లండ్‌పై 7 సెంచరీలు

కాగా, విరాట్‌ కోహ్లి ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో అజేయ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇది అతనికి టెస్ట్‌ల్లో 30వ సెంచరీ కాగా.. ఓవరాల్‌గా 81వ సెంచరీ.

ఇదిలా ఉంటే, డిసెంబర్‌ 6 నుంచి అడిలైడ్‌ వేదికగా పింక్‌ బాల్‌ టెస్ట్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.

పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో తడబడ్డా రెండో ఇన్నింగ్స్‌లో విజృంభించి ఆసీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు. యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి సెంచరీలతో విరుచుకుపడగా.. బుమ్రా ఎనిమిది వికెట్ల ప్రదర్శనతో ఆసీస్‌ నడ్డి విరిచాడు.   

Advertisement
 
Advertisement
Advertisement