
హండ్రెడ్ లీగ్ 2024లో నిన్న (జులై 29) ఓ రసవత్తర సమరం జరిగింది. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్ రాకెట్స్ పరుగు తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో మాంచెస్టర్ గెలుపుకు చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. క్రీజ్‌లో ఓపెనింగ్ బ్యాటర్ మ్యాక్స్ హోల్డన్ ఉన్నాడు. జోర్డన్ థాంప్సన్ బౌలింగ్ చేస్తున్నాడు. మామూలు షాట్ ఆడినా ఓ పరుగు సులువుగా వచ్చేది. అయితే హోల్డన్ భారీ షాట్‌తో మ్యాచ్ ముగిద్దామని ప్రయత్నించి సామ్ హెయిన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా రాకెట్స్ మ్యాచ్‌ను చేజార్చుకుంది.
2 runs needed off 1 ball and then this happened 🤯🤯🤯
The craziest match of the year already 🔥#TheHundred #tapmad #HojaoADFree pic.twitter.com/2ByQfycxNJ— Farid Khan (@_FaridKhan) July 29, 2024
ఈ మ్యాచ్‌లో రాకెట్స్ సునాయాసంగా గెలవాల్సింది. చివరి ఐదు బంతుల్లో ఆ జట్టు ఆరు పరుగులు చేస్తే గెలిచి ఉండేది. సికందర్ రజా తొలి రెండు బంతులకు రెండు డబుల్స్ తీసి రాకెట్స్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. మూడో బంతికి పరుగు రాకపోగా.. నాలుగో బంతికి సికందర్ రజా రనౌటయ్యాడు. దీంతో చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి వచ్చింది. జోర్డన్ థాంప్సన్ లెంగ్త్ డెలివరిని వేయగా హోల్డన్ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి బ్యాక్‌వర్డ్ స్వేర్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్.. నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. టామ్ బాంటన్ (45), రోవ్‌మన్ పావెల్ (27), రషీద్ ఖాన్ (15 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మాంచెస్టర్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 3, సికందర్ రజా 2, పాల్ వాల్టర్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో మాంచెస్టర్ 100 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులకు పరిమితమైంది. ఫలితంగా రాకెట్స్ పరుగు తేడాతో విజయం సాధించింది. మాంచెస్టర్ ఇన్నింగ్స్‌లో హెల్డన్ (40) టాప్ స్కోరర్‌గా కాగా.. మ్యాడ్‌సన్ (28), వాల్టర్ (29), సికందర్ రజా (21) ఓ మోస్తరు పరుగులు చేశారు. రాకెట్స్ బౌలర్లలో ఇమాద్ వసీం, రషీద్ ఖాన్, సామ్ కుక్ తలో 2 వికెట్లు, థాంప్సన్ ఓ వికెట్ పడగొట్టారు.
నిన్ననే ఇరు జట్ల మధ్య జరిగిన మహిళల మ్యాచ్‌లో ఫలితం రివర్స్ అయ్యింది. ట్రెంట్ రాకెట్స్‌పై మాంచెస్టర్ ఒరిజినల్స్ పరుగు తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ నిర్ణీత 100 బంతుల్లో 137 పరుగులు చేయగా.. రాకెట్స్ 100 బంతుల్లో 136 పరుగులకే ఓటమిపాలైంది.