శతకంతో రెచ్చిపోయిన హోప్‌; 250 పరుగుల టార్గెట్‌ను ఊదేసిన విండీస్‌ | Hope-Unbeaten-Ton-WI-Record-Chase-Won-6 Wkts-Vs IND 2nd T20 | Sakshi
Sakshi News home page

శతకంతో రెచ్చిపోయిన హోప్‌; 250 పరుగుల టార్గెట్‌ను ఊదేసిన విండీస్‌, భారత్‌ ఫ్యూజులు ఔట్‌!

Oct 9 2026 10:54 PM | Updated on Oct 9 2026 11:04 PM

Hope-Unbeaten-Ton-WI-Record-Chase-Won-6 Wkts-Vs IND 2nd T20

రాంచీ వేదిక‌గా టీమిండియాతో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. భార‌త్ విధించిన 250 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని విండీస్ 18.3 ఓవ‌ర్లలోనే ఛేదించ‌డం విశేషం. కెప్టెన్ షెయ్ హోప్ (45 బంతుల్లో 102 నాటౌట్‌, 6 ఫోర్లు, 9 సిక్స‌ర్లు) ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. 

హోప్‌కు తోడు రూథ‌ర్‌ఫోర్డ్ (37 బంతుల్లో 84, 7 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) విధ్వంసం సృష్టించ‌గా, ఆఖ‌ర్లో రొమారియో షెప‌ర్డ్ (13 బంతుల్లో 34 నాటౌట్‌, 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) మెరుపులు తోడ‌య్యాయి. భార‌త బౌల‌ర్ల‌లో మ‌యాంక్ యాద‌వ్ 3 వికెట్లు తీయ‌గా, కుల్దీప్ యాద‌వ్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు. 

అంతకముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోరు చేసింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైన ఓపెనర్ సంజూ శాంసన్ (41 బంతుల్లో 82, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్‌తో అలరించగా, ఇషాన్ కిషన్ (22 బంతుల్లో 43, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దనాధన్ ఆటతీరును ప్రదర్శించాడు. 

చివర్లో శ్రేయస్ అయ్యర్ (17 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) గత మ్యాచ్ ఫామ్‌ను కంటిన్యూ చేయగా, తిలక్ వర్మ (18 బంతుల్లో 44 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ మూడు వికెట్లు తీయగా, షమర్ స్ప్రింగర్ రెండు వికెట్లు తీశాడు. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇరుజట్ల మధ్య మూడో టీ20 ఆదివారం జరగనుంది.

👉తద్వారా వెస్టిండీస్ తమ టీ20 చరిత్రలోనే అత్యధిక పరుగుల టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గ‌తంలో 2015లో ద‌క్షిణాఫ్రికా విధించిన 236 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 19.2 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించ‌డ‌మే ఇప్ప‌టివ‌ర‌కు ఆ జ‌ట్టుకు అత్యుత్త‌మంగా ఉండేది. తాజాగా టీమిండియాపై 250 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించి ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పింది. 2024లో ఇంగ్లండ్ విధించిన 221 ప‌రుగుల టార్గెట్‌ను 5 వికెట్లు కోల్పోయి 19 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. 

👉ఇక 2016లో ముంబై వేదిక‌గా టీమిండియా విధించిన‌ 196 ప‌రుగుల ల‌క్ష్యాన్ని వెస్టిండీస్ 19.4 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. 2017లో కింగ్‌స్ట‌న్ వేదిక‌గా భార‌త్ విధించిన 194 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 18.3 ఓవ‌ర్లలో ఒక వికెట్ మాత్ర‌మే కోల్పోయి ఛేధించ‌డం విశేషం. 

👉 ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో చేజింగ్‌లో వెస్టిండీస్‌ ఛేదించిన 250 పరుగుల లక్ష్యం రెండో అత్యుత్తమం. 2023లో ఇదే వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా 259 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించడం ఇప్పటికీ ప్రపంచ రికార్డుగానే ఉంది.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement