#Kagiso Rabada: కగిసో ర‌బాడపై సస్పెన్షన్ వేటు.. ఐపీఎల్‌కు దూరం? | Gujarat Titans Kagiso Rabada suspended for failing dope test | Sakshi
Sakshi News home page

#Kagiso Rabada: కగిసో ర‌బాడపై సస్పెన్షన్ వేటు.. ఐపీఎల్‌కు దూరం?

May 3 2025 8:36 PM | Updated on May 3 2025 8:58 PM

Gujarat Titans Kagiso Rabada suspended for failing dope test

PC: Inside sport

ద‌క్షిణాఫ్రికా స్పీడ్ స్టార్‌, గుజ‌రాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌల‌ర్ కగిసో ర‌బాడ ఐపీఎల్‌-2025 మ‌ధ్య‌లోనే త‌న స్వ‌దేశానికి వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ర‌బాడ సౌతాఫ్రికా వెళ్లిన‌ట్లు గుజ‌రాత్ టైటాన్స్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. దాదాపు 20 రోజులు అవుతున్న‌ప్ప‌టికి ర‌బాడ తిరిగి భార‌త్‌కు మ‌ళ్లీ రాలేదు.

ఈ క్ర‌మంలో త‌న స్వ‌దేశానికి వెళ్లిపోవ‌డానికి అస్స‌లు కార‌ణాన్ని రబాడ వెల్ల‌డించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2025 స‌మ‌యంలో నిషేదిత డ్ర‌గ్ వాడ‌డంతో త‌న‌పై తాత్క‌లిక‌ సస్పెన్షన్‌ వేటు ప‌డిన‌ట్లు ర‌బాడ తెలిపాడు. అందుకే ఐపీఎల్ మ‌ధ్య‌లోనే వైదొలిగ‌న‌ట్లు  ఈ స్పీడ్ స్టార్ స్ప‌ష్టం చేశాడు. దీంతో ఐపీఎల్‌-2025లో మిగిలిన మ్యాచ్‌ల‌కు కూడా ర‌బాడ దూరం కానున్నాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికా తరపున కూడా ర‌బాడ అడేది సందేహంగా మారింది.

నేను ఐపీఎల్‌లో ఆడకుండా వ్యక్తిగత కారణాల వల్ల తిరిగి దక్షిణాఫ్రికాకు వచ్చానని ఇప్పటికే గుజ‌రాత్ టైటాన్స్ ఓ ప్ర‌క‌టన చేసింది. అయితే నిషేధిత డ్ర‌గ్ వాడ‌డంతో సౌతాఫ్రికా క్రికెట్ నాపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. అందుకే ఉన్న‌ప‌ళంగా స్వదేశానికి వెళ్లాల్సి వ‌చ్చింది. 

ఈ త‌ప్పు చేసినందుకు అంద‌రికి క్ష‌మాప‌ణ‌లు తెలుపుతున్నాను. క్రికెట్ ఆడే అవకాశాన్ని ఎల్ల‌ప్పుడూ నేను అరుదైన గౌర‌వంగా భావిస్తాను. తిరిగి నాకు ఇష్టమైన ఆట ఆడేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఈ కఠిన సమయంలో సపోర్ట్‌గా నిలిచిన నా ఏజెంట్‌, సౌతాఫ్రికా క్రికెట్‌, గుజరాత్ టైటాన్స్‌కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను" అని ఓ ప్రకటనలో రబాడ పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement