ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి జోడీ  | Gayatri Jodi in Prequarters | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి జోడీ 

Mar 6 2024 4:19 AM | Updated on Mar 6 2024 4:19 AM

Gayatri Jodi in Prequarters - Sakshi

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల డబుల్స్‌ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్‌) జోడీ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం 16–21, 21–19, 21–17తో భారత్‌కే చెందిన అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జంటను ఓడించింది. పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం శుభారంభం చేసింది.

తొలి రౌండ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 21–13, 24–22తో ఒంగ్‌ యె సిన్‌–తియో ఈ యి (మలేసియా) జంటపై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో లక్ష్య సేన్‌ (భారత్‌) 15–21, 21–15, 21–3తో కాంటా సునెయామ (జపాన్‌)పై నెగ్గగా... ప్రియాన్షు రజావత్‌ (భారత్‌) 8–21, 15–21తో ప్రపంచ నంబర్‌వన్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడిపోయాడు.   
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement