పాకిస్తాన్‌ అస్సలు జట్టే కాదు.. గ్రూపులుగా విడిపోయారు: గ్యారీ కిర్‌స్టన్‌ Gary Kirsten Lashes Out At Pakistan Team After T20 World Cup Exit. Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ అస్సలు జట్టే కాదు.. గ్రూపులుగా విడిపోయారు: గ్యారీ కిర్‌స్టన్‌

Published Tue, Jun 18 2024 9:04 AM | Last Updated on Tue, Jun 18 2024 10:00 AM

Gary Kirsten Lashes Out At Pakistan Team After T20 World Cup Exit

టీ20 వరల్డ్‌కప్-2024లో మాజీ ఛాంపియన్స్‌ పాకిస్తాన్‌ దారుణ ప్రదర్శన కనబరిచింది. టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్‌ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ ఈ మెగా టోర్నీ లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది.

టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో పాకిస్తాన్‌ గ్రూపు స్టేజిలోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పాక్‌ జట్టుపై మాజీ ఆటగాళ్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పాక్‌ ప్రస్తుత హెడ్‌ కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్ చేరాడు. 

ప్రస్తుత పాక్‌ జట్టులో కొంచెం కూడా ఐక్యత లేదని కిర్‌స్టెన్ మండిపడ్డాడు. కాగా 2023 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత పాక్‌క్రికెట్‌ బోర్డు తమ కోచింగ్‌ బృందాన్ని మొత్తం మార్చేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్‌లో పాక్‌ జట్టు పరిమిత ఓవర్ల హెడ్‌కోచ్‌గా కిర్‌స్టెన్ బాధ్యతలు చేపట్టాడు.

అయితే భారత్‌కు వన్డే వరల్డ్‌కప్‌ను అందించిన కిర్‌స్టెన్‌.. పాక్‌ జట్టుతో సైతం అద్భుతాలు సృష్టిస్తాడని అందరూ భావించారు. కానీ పాక్ జట్టు మాత్రం చెత్త ప్రదర్శన కనబరిచి తొలిరౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది.

"పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌ అస్సలు జట్టే కాదు. పాక్‌ జట్టులో ఐక్యత లేదు. ఒకరికొకరు సపోర్ట్‌గా లేరు. ఎవరికి వారు నచ్చిన విధంగా ఉన్నారు. గ్రూపులుగా విడిపోయారు. నేను నా కెరీర్‌లో చాలా జట్లతో కలిసి పనిచేశాను. 

కానీ ఏ జట్టులో కూడా ఇటువంటి పరిస్థితులు నేను చూడలేదు. అదేవిధంగా పాక్‌ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ లెవల్స్‌ కూడా అంతంతమాత్రమే అని గ్యారీ కిర్‌స్టన్‌ అన్నట్లు" పాక్‌ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement