భారత్‌కు తొలి పరాజయం | First defeat for India | Sakshi
Sakshi News home page

భారత్‌కు తొలి పరాజయం

Feb 16 2024 3:41 AM | Updated on Feb 16 2024 3:41 AM

First defeat for India - Sakshi

ప్రొ హాకీ లీగ్‌ టోర్నీలో భారత పురుషుల జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. ఆ్రస్టేలియాతో గురువారం భువనేశ్వర్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4–6 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌ (12వ, 20వ ని.లో) రెండు గోల్స్‌ చేయగా... సుఖ్‌జీత్‌ (18వ ని.లో), మందీప్‌ (29వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు.

ఆస్ట్రేలియా తరఫున బ్లేక్‌ గోవర్స్‌ (2వ ని.లో) రెండు గోల్స్‌ చేయగా... జలెవ్‌స్కీ (40వ ని.లో), షార్ప్‌ (52వ ని.లో), అండర్సన్‌ (55వ ని.లో), జాక్‌ వెల్చ్‌ (58వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో భారత్‌ ఆడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement