'ఈసారి కూడా మాదే పైచేయి'.. బాస్‌ దానికి చాలా టైముంది

Fans Fire Shoaib Akhtar Pakistan Will Beat India Again T20 World Cup 2022 - Sakshi

టి20 ప్రపంచకప్‌ 2022లో లీగ్‌ దశలో చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఒకే గ్రూఫ్‌లో ఉన్న కారణంగా టీమిండియా, పాకిస్తాన్‌ అక్టోబర్‌ 23న మెల్‌బోర్న్‌ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ జరగడానికి దాదాపు తొమ్మిది నెలల సమయం ఉన్నప్పటికి పాకిస్తాన్‌ ఆటగాళ్లు ఇప్పటినుంచే కత్తులు దూస్తున్నారు. తాజాగా షోయబ్‌ అక్తర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: "ఈ సారి కూడా విజ‌యం పాకిస్తాన్‌దే.. కోహ్లి, రోహిత్ త‌ప్ప‌..."

''ఈసారి కూడా విజయం మాదే. టి20 ప్రపంచకప్‌లో మెల్‌బోర్న్‌ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో టీమిండియాపై పాకిస్తాన్‌ మరోసారి పై చేయి సాధిస్తుంది. టి20 క్రికెట్‌లో పాకిస్తాన్‌ ఎప్పుడు భారత్‌ కంటే బెటర్‌గానే కనిపిస్తుంది. ఇరు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్‌ జరిగినా..  భారత్‌ మీడియా పనిగట్టుకొని టీమిండియాపై అనవసర ఒత్తిడి పెంచుతున్నారు. ఇది మాకు సానుకూలంగా మారుతుంది.. టీమిండియా అందుకే ఓడిపోతుంది'' అంటూ కామెంట్‌ చేశాడు. అయితే అక్తర్‌ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''అంత సీన్‌ లేదు.. ఈసారి టీమిండియాదే పై చేయి అవుతుంది... మ్యాచ్‌కు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది.. ఇప్పుడే అంత తొందరెందుకు అక్తర్‌.. దానికి  చాలా సమయం ఉంది''.. అంటూ కామెంట్స్‌ చేశారు.

కాగా టీ20 ప్ర‌పంచక‌ప్-2021 లీగ్ ద‌శ‌లో పాక్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2022 అక్టోబర్ 16నుంచి న‌వంబ‌ర్ 13 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. న‌వంబ‌ర్ 9న తొలి సెమీఫైన‌ల్, న‌వంబ‌ర్ 10న రెండో సెమీఫైన‌ల్ జ‌ర‌గ‌నున్నాయి. ఇక ఫైన‌ల్  మెల్‌బోర్న్ వేదిక‌గా న‌వంబ‌ర్‌ 13న జ‌ర‌గ‌నుంది. మొత్తం 8 జ‌ట్లును రెండు గ్రూపులుగా ఐసీసీ విభిజించింది. గ్రూప్‌-1లో ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ జ‌ట్లు ఉండ‌గా, గ్రూప్‌-2లో టీమిండియా,పాకిస్తాన్,ద‌క్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జ‌ట్లు ఉన్నాయి.

చదవండి: SA vs IND: చివరి వన్డేలో గెలిచి భారత్ పరువు నిలుపుకునేనా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top