Sakshi News home page

మరోసారి ‘యెల్లో’ జెర్సీ ధరించనున్న డుప్లెసిస్‌.. చెన్నై ప్రాంఛైజీ కెప్టెన్‌గా

Published Sat, Jun 17 2023 3:46 PM

Faf du Plessis joins CSKs USA franchise Texas Super Kings - Sakshi

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ మరో చెన్నై సూపర్‌ కింగ్స్ ఫ్రాంచైజీతో మరోసారి జతకట్టాడు. అగ్ర రాజ్యం అమెరికా తొలిసారి నిర్వహిస్తున్న మేజర్ లీగ్ క్రికెట్ టీ20 టోర్నీలో డుప్లెసిస్‌ భాగం కానున్నాడు. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ (టీఎస్కే)  తరఫున ఆడనున్నాడు. అంతేకాకుండా జట్టుకు అతడే  అతడే సారథిగా వ్యవహరించనున్నాడు.

ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా టెక్సాస్ సూపర్ కింగ్స్‌ వెల్లడించింది. ఇక ఇప్పటికే దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సీఎస్‌కే కొనుగొలు చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టుకు డుప్లెసిస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. అదే విధంగా ఐపీఎల్‌లో కూడా చాలా సీజన్ల పాటు సీఎస్‌కేకు డుప్లెసిస్‌ ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌లో దాదాపు సీఎస్‌కే తరపున 100పైగా మ్యాచ్‌లు ఆడిన ఫాప్‌.. 2,935 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో ఫాప్‌ ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌-2023లో 14 మ్యాచ్‌లు ఆడిన డుప్లెసిస్‌..  730 పరుగులు చేసి   అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో  రెండో స్ధానంలో నిలిచాడు. ఇక మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో డు ప్లెసిస్‌తో పాటు అంబటి  రాయుడు, డ్వేన్ బ్రావో, మిచెల్  సాంట్నర్, డెవాన్ కాన్వే, డేవిడ్ మిల్లర్ వంటి స్టార్‌ క్రికెటర్లు టెక్సాస్ సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నారు. కాగా ఎంఎల్‌సీ  ఫస్ట్ సీజన్ జులై 13 నుంచి జూలై 30 వర​కు జరగనుంది.
 

Advertisement

What’s your opinion

Advertisement