
భారత మహిళలతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. గజ్జ గాయం కారణంగా భారత్‌తో టీ20 సిరీస్ మధ్యలోనే వైదొలిగిన ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ స్కైవర్-బ్రంట్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చింది.
అదేవిధంగా సోఫీ ఎకిలిస్టోన్, బౌచర్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు ఎకిలిస్టోన్ దూరమైంది. మానసిక ఒత్తిడి కారణంగా కొన్నాళ్ల పాటు క్రికెట్ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
కానీ ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని తన నిర్ణయాన్ని సోఫీ మార్చుకుంది. ఈ క్రమంలోనే వన్డే జట్టులోకి ఆమె తిరిగొచ్చింది. ఈ సిరీస్ వన్డే వరల్డ్‌కప్-2025 సన్నాహాకాల్లో భాగంగా జరగనుంది. జూలై 16 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ రెండు జట్లు టీ20 సిరీస్‌లో తలపడతున్నాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-2 ఆధిక్యంలో భారత్ కొనసాగుతోంది.
వన్డే సిరీస్ షెడ్యూల్:
1వ వన్డే – జూలై 16, ది అగేస్ బౌల్, సౌతాంప్టన్
2వ వన్డే – జూలై 19, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్
3వ వన్డే – జూలై 22, సీట్ యూనిక్ రివర్‌సైడ్, చెస్టర్-లె-స్ట్రీట్
భారత్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు
నాట్ స్కైవర్-బ్రంట్(కెప్టెన్),ఎమ్ ఆర్లాట్, టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, మైయా బౌచియర్, ఆలిస్ కాప్సే, కేట్ క్రాస్, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్, ఎమ్మా లాంబ్, లిన్సే స్మిత్
భారత మహిళల వన్డే జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చారణి, శుచి ఉపాధ్యాయ్, అరుంధతి రెడ్డి, కె. సత్ఘరే
చదవండి: IND vs ENG 3rd Test: లార్డ్స్ టెస్టుకు గ్రీన్ పిచ్.. భారత జట్టులోకి యువ సంచలనం?