
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గెలిచి ఇంగ్లండ్ కంచుకోటను బద్దలు కొట్టిన భారత జట్టు ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు జూలై 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కూడా తమ జోరును కొనసాగించి ప్రత్యర్దిని మట్టికర్పించాలని టీమిండియా(Teamindia) ఉవ్విళ్లూరుతోంది. లార్డ్స్ టెస్టు కోసం గిల్ సేన మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోంది.
మెకల్లమ్ మాస్టర్ ప్లాన్..
కాగా మూడో టెస్టు కోసం లార్డ్స్ పిచ్‌ను ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే విధంగా క్యూరేటర్లు తాయారు చేశారు. ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్(Brendon McCullum) అభ్యర్ధన మేరకు క్యూరేటర్లు పేస్ బౌలింగ్‌కు సరిపోయే వికెట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఈ పిచ్‌ను మంగళవారం భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రెవ్‌స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఎక్స్‌లో షేర్ చేసింది. పిచ్‌పై ఎక్కువగా గ్రాస్‌ను ఉంచినట్లు ఫోటోలో కన్పిస్తోంది. దీంతో ఈ పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లు పండగ చేసుకోనున్నారు.
సుందర్‌పై వేటు..?
ఇక లార్డ్స్ వికెట్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే అవకాశమున్నందన అదనపు పేసర్‌తో భారత్ బరిలోకి దిగే అవకాశముంది. స్పిన్ ఆలౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను పక్కన పెట్టి పేస్ బౌలింగ్ సంచలనం అర్ష్‌దీప్ సింగ్‌కు భారత టెస్టు క్యాప్‌ను అందించే సూచనలు కన్పిస్తున్నాయి.
రెండో టెస్టులో సుందర్ అద్బుతంగా రాణించినప్పటికి పిచ్ కండీషన్స్ కారణంగా వేటు పడకతప్పదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా మూడో టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నందన ఎడ్జ్‌బాస్టన్‌లో ఘోరంగా విఫలమైన ప్రసిద్ద్ కృష్ణపై వేటు పడడం ఖాయన్పిస్తోంది.
చదవండి: అతడు కోహ్లి, టెండుల్కర్ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు: ఇంగ్లండ్ మాజీ బ్యాటర్
First look of the Lord's pitch for the third Test between India and England. India head coach Gautam Gambhir and batting coach Sitanshu Kotak take a closer view.
📸 @CricSubhayan pic.twitter.com/YC8pSaxKDI— RevSportz Global (@RevSportzGlobal) July 8, 2025