శాంతించిన వైభవ్‌ సూర్యవంశీ.. విధ్వంసం డోసు కాస్త తగ్గింది..! | ENG U19 Vs IND U19 5th Youth ODI: Vaibhav Suryavanshi Out For 33 In 42 Balls | Sakshi
Sakshi News home page

శాంతించిన వైభవ్‌ సూర్యవంశీ.. విధ్వంసం డోసు కాస్త తగ్గింది..!

Jul 7 2025 9:15 PM | Updated on Jul 7 2025 9:15 PM

ENG U19 Vs IND U19 5th Youth ODI: Vaibhav Suryavanshi Out For 33 In 42 Balls

ఇంగ్లండ్‌ పర్యటనలో భారత యువ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ తొలిసారి శాంతించాడు. ఇవాళ (జులై 7) జరుగుతున్న ఐదో యూత్‌ వన్డేలో 42 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో, 78.57 స్ట్రయిక్‌రేట్‌తో 33 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో వైభవ్‌ ఇంత తక్కువ స్ట్రయిక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేయడం ఇదే మొదటిసారి. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో వైభవ్‌ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 130కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు.

తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్‌.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌ వైభవ్‌ విధ్వంసం ధాటికి ఇంగ్లండ్‌ యువ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వైభవ్‌ ప్రతి మ్యాచ్‌ల కనీసం రెండైనా సిక్సర్లు కొట్టాడు.

ఇంగ్లండ్‌ పర్యటనలో వైభవ్‌ తొలిసారి శాంతించడంతో భారత్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఇవాళ జరుగుతున్న ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన యంగ్‌ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 210 పరుగులు మాత్రమే చేసింది. ఆర్‌ఎస్‌ అంబ్రిష్‌ (66) అజేయ అర్ద శతకంతో రాణించి టీమిండియాకు ఈ మాత్రం స్కోరైనా అందించాడు. జట్టులో నెక్స్‌ హైయ్యెస్ట్‌ స్కోర్‌ వైభవ్‌దే. 

మిగతా ఆటగాళ్లలో రాహుల్‌ కుమార్‌ (21), హర్వంశ్‌ పంగాలియా (24), కనిశ్క్‌ చౌహాన్‌ (24), యుద్దజిత్‌ గుహా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆయుశ్‌ మాత్రే (1) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. మరో స్టార్‌ బ్యాటర్‌ విహాన్‌ మల్హోత్రా (1) కూడా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఫ్రెంచ్‌, ఆల్బర్ట్‌ చెరో 2 వికెట్లు తీయగా.. ఫిర్బాంక్‌, మోర్గాన్‌, గ్రీన్‌, ఎకాంశ్‌ సింగ్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ విజయం దిశగా అడుగులు వేస్తుంది. 21 ఓవర్ల తర్వాత ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. బెన్‌ డాకిన్స్‌ (66) అర్ద సెంచరీతో రాణించగా.. బెన్‌ మేస్‌ (45) ఇంగ్లండ్‌ను గెలుపు దిశగా తీసుకెళ్తున్నాడు. మేస్‌కు జతగా కెప్టెన్‌ రూ (2) క్రీజ్‌లో ఉన్నాడు.

కాగా, ఈ సిరీస్‌ను భారత్‌ ఇదివరకే కైవసం చేసుకుంది. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో భారత్‌ మూడింట విజయాలు సాధించింది. చివరిదైన ఈ మ్యాచ్‌లో ఓడినా టీమిండియాకు ఒరిగేదేమీ ఉండదు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ రెండో వన్డేలో మాత్రమే నెగ్గింది. వన్డే సిరీస్‌ అనంతరం భారత్‌ ఇంగ్లండ్‌తో రెండు మ్యాచ్‌ల యూత్‌ టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. తొలి టెస్ట్‌ జులై 12 నుంచి 15 వరకు బెకెన్హమ్‌లో జరుగనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement