అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌.. విరాట్‌ కోహ్లికి గుడ్‌ టైమ్‌ స్టార్ట్‌ కానుందా..? | Is Donald Trump A Lucky Charm For Virat Kohli? US President Weird Coincidence With Kohli | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌.. విరాట్‌ కోహ్లికి గుడ్‌ టైమ్‌ స్టార్ట్‌ కానుందా..?

Nov 6 2024 6:37 PM | Updated on Nov 6 2024 6:49 PM

Is Donald Trump A Lucky Charm For Virat Kohli? US President Weird Coincidence With Kohli

యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌ఏ) 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికయ్యాడు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి అయిన ట్రంప్‌.. డెమోక్రాట్‌ అభ్యర్థి కమలా హ్యారిస్‌పై ఘన విజయం సాధించాడు.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌.. విరాట్‌కు గుడ్‌ టైమ్‌ స్టార్ట్‌ కానుందా..?
ఇక్కడ ట్రంప్‌ ఎన్నికకు విరాట్‌ కోహ్లికి సంబంధం ఏముందని అనుకుంటున్నారా..? అయితే ఈ లెక్కలు చూడండి విషయం మీకే అర్థమవుతుంది. కెరీర్‌ ప్రారంభమైన నాటి నుంచి 2015 వరకు విరాట్‌ కోహ్లికి బ్యాటర్‌గా మంచి సక్సెసే వచ్చింది. అయితే ఇవన్ని అతనికి తగినంత ఫేమ్‌ తెచ్చిపెట్టలేదు.

2016 నుంచి విరాట్‌కు ప్రపంచ మేటి బ్యాటర్‌గా గుర్తింపు రావడం మొదలైంది. 2016 నుంచి 2021 వరకు విరాట్‌ అడ్డూఅదుపూ లేకుండా క్రికెట్‌లోని దాదాపు అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ ఐదేళ్ల కాలంలో విరాట్‌ తన సమకాలీకులకు అందంనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఈ మధ్యకాలంలో విరాట్‌ ఫార్మాట్లకతీతంగా అత్యుత్తమ ప్రదర్శనలు నమోదు చేశాడు.

విరాట్‌ హవా పీక్స్‌లో కొనసాగుతున్న కాలంలోనే (2016-2021) ట్రంప్‌ అమెరికాకు తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ట్రంప్‌ అమెరికాకు తొలి దఫా అధ్యక్షుడిగా ఉన్నంతకాలం విరాట్‌ ప్రపంచ క్రికెట్‌ను మకుటం లేని మహారాజుగా శాశించాడు. ట్రంప్‌ 2016 నవంబర్‌లో అమెరికాకు తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నిక కాగా.. సరిగ్గా అదే సమయం నుంచి విరాట్‌కు గుడ్‌ టైమ్‌ స్టార్ట్‌ అయ్యింది.

ట్రంప్‌ ఓడిపోవడంతో విరాట్‌కు బ్యాడ్‌ టైమ్‌..!
2020లో ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడంతో విరాట్‌కు కూడా బ్యాడ్‌ టైమ్‌ స్టార్‌ అయ్యింది. 2021 నుంచి 2023 మధ్య వరకు విరాట్‌ తన కెరీర్‌లో ఎన్నడూ ఎదుర్కోని గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నాడు. 2021, 2022లో అయితే విరాట్‌ అదఃపాతాలానికి పడిపోయాడు. ఈ రెండేళ్లలో విరాట్‌ బ్యాట్‌ నుంచి చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్సూ లేదు.

విరాట్‌ 2023లో అడపాదడపా ఫామ్‌ను అందుకున్నా తిరిగి 2024లో తన ఫామ్‌ను కోల్పోయాడు. ఈ ఏడాది ఇప్పటివరకు విరాట్‌ బ్యాట్‌ నుంచి ఒక్క మంచి ఇన్నింగ్స్‌ జాలువారలేదు. ఈ ఏడాది ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కనీసం ఇప్పటి నుంచైనా విరాట్‌కు మంచి టైమ్‌ స్టార్‌ అవుతుందేమో వేచి చూద్దాం.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement