IND vs AUS: భారత జట్టులో కీలక మార్పు! స్టార్‌ బౌలర్‌ ఎంట్రీ | Deepak Chahar Replaces Mukesh Kumar In A Last Minute-Change Ahead Of Third T20I vs AUS | Sakshi
Sakshi News home page

IND vs AUS: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. భారత జట్టులో కీలక మార్పు! స్టార్‌ బౌలర్‌ ఎంట్రీ

Nov 28 2023 7:35 PM | Updated on Nov 28 2023 8:00 PM

Deepak Chahar Replaces Mukesh Kumar In A Last Minute-Change Ahead Of Third T20I vs AUS - Sakshi

PC: AFP

గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20కు టీమిండియా యువ పేసర్‌ ముఖేష్‌ కుమార్‌ దూరమయ్యాడు. తన పెళ్లి కారణంగా మూడో టీ20కు ముందు ముఖేష్‌ను జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్‌ చేసింది.

ఇక అతడి స్ధానాన్ని మరో యువ ఫాస్ట్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ బీసీసీఐ భర్తీ చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్‌ వేదికగా మంగళవారం వెల్లడించింది. అయితే రాయ్‌పూర్‌ వేదికగా జరగనున్న నాలుగో టీ20కు ముందు అతడు జట్టుతో కలవనున్నాడు.

ముఖేష్‌ జట్టులోకి వచ్చినప్పటికీ చాహర్‌ కూడా జట్టులో కొనసాగనున్నాడు. "గౌహతిలో ఆస్ట్రేలియాతో జరిగే మూడో టీ20కి ముందు టీమిండియా నుంచి తనను విడుదల చేయాలని ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ బీసీసీఐని అభ్యర్థించాడు.

ముఖేష్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. దీంతో అతడికి సెలవు మంజూరు చేయబడింది.  అతడి స్ధానంలో దీపక్‌ చాహర్‌ జట్టుతో చేరాడు. ముఖేష్‌ తిరిగి రాయ్‌పూర్‌లో జరిగే 4వ టీ20కి ముందు జట్టులో చేరనున్నాడని" బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా దీపక్‌ చాహర్‌ చివరగా గతేడాది దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో టీమిండియా తరపున ఆడాడు.
చదవండిసచిన్‌ అంతటి వాడవుతాడు.. పోలికలే కొంపముంచుతున్నాయి! తొందరపడి ముందే ఎందుకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement