మెయిన్‌ ‘డ్రా’కు రష్మిక అర్హత 

Davis Cup 2024: India Beat Pakistan Enter World Group I - Sakshi

Mumbai Open WTA-125 Rashmika Srivalli Advances To Main Draw:: ముంబై ఓపెన్‌ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించింది. ముంబైలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ రెండో రౌండ్‌లో ప్రపంచ 521వ ర్యాంకర్‌ రష్మిక 6–3, 3–6, 6–3తో ప్రపంచ 482వ ర్యాంకర్‌ విక్టోరియా మొర్వాయోవా (స్లొవేకియా)పై విజయం సాధించింది. 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఆరు ఏస్‌లు సంధించింది.  

వరల్డ్‌ గ్రూప్‌-1లో భారత్‌
డేవిస్‌కప్‌ టోర్నీలో భారత  పురుషుల టెన్నిస్‌ జట్టు మళ్లీ వరల్డ్‌ గ్రూప్‌–1లో చోటు సంపాదించింది. ఆదివారం పాకిస్తాన్‌తో ముగిసిన వరల్డ్‌ గ్రూప్‌–1 ప్లే ఆఫ్‌ పోటీలో 4–0తో గెలుపొందింది.

చదవండి:  భారత్‌కు మరో ఓటమి 
భువనేశ్వర్‌: మహిళల ప్రొ లీగ్‌ హాకీ టోర్నీలో భారత జట్టు మరో ఓటమి చవిచూసింది. నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 1–3తో ఓడింది. భారత్‌ తరఫున నవనీత్‌ కౌర్‌ ఏకైక గోల్‌ చేసింది. నెదర్లాండ్స్‌ తరఫున యిబ్బీ జాన్సెన్‌ రెండు గోల్స్, ఫేవాన్‌డెర్‌ ఒక గోల్‌ సాధించారు.  

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top