CWC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌.. స్టోక్స్‌ లేకుండానే..! | CWC 2023, ENG vs BAN: Bangladesh Won The Toss And Opt To Bowl | Sakshi
Sakshi News home page

CWC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌.. స్టోక్స్‌ లేకుండానే..!

Oct 10 2023 10:24 AM | Updated on Oct 10 2023 10:28 AM

CWC 2023 ENG VS BAN: Bangladesh Won The Toss And Opt To Bowl - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 10) ఇంగ్లండ్‌-బంగ్లాదేశ్‌ జట్లు తలపడుతున్నాయి. ఉదయం 10:30 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కూడా స్టోక్స్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. మొయిన్‌ అలీ స్థానంలో రీస్‌ టాప్లే బరిలోకి దిగుతుండగా.. బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ మహ్మదుల్లా స్థానంలో మెహది హసన్‌ జట్టులోకి వచ్చాడు. 

తుది జట్లు..
ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లే

బంగ్లాదేశ్: తంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ షాంటో, షకీబ్ అల్ హసన్(కెప్టెన్‌), మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్‌), తౌహిద్ హృదొయ్, మెహది హసన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్

Advertisement
 
Advertisement
Advertisement