ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ సారథి ప్యాట్ కమిన్స్‌పై విశ్వాసం ఉంచింది. 2026 సీజన్‌లో కూడా కమిన్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని సన్‌రైజర్స్ యాజమాన్యం సోమవారం ఎక్స్ వేదికగా ప్రకటించింది. కమిన్స్ వరుసగా మూడో సీజన్‌లో జట్టు నాయకత్వ బాధ్యతలు చేపడుతున్నాడు. 2024లో కమిన్స్ కెప్టెన్సీలో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచిన జట్టు... గత సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 6 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో ముగించింది.
ప్లే ఆఫ్స్‌కు చేరడంలో విఫలమైనా... 15 మంది ఆటగాళ్లను టీమ్ అట్టిపెట్టుకుంది. కమిన్స్ సారథ్యంలో రెండు సీజన్లు కలిపి 30 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 15 గెలిచి, 14 ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ప్రస్తుతం కమిన్స్ వెన్నునొప్పి గాయం నుండి కోలుకుంటున్నాడు.
ఈ క్రమంలో అతడు పెర్త్ వేదికగా జరగనున్న యాషెస్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్ధానంలో స్టీవ్ స్మిత్ ఆసీస్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అయితే డిసెంబర్ 4 నుంచి బ్రిస్బేన్‌లో ప్రారంభమయ్యే రెండో టెస్టు నాటికి కమ్మిన్స్ పూర్తి ఫిట్‌నెస్ సాధించినున్నట్లు తెలుస్తోంది.
ముచ్చటగా మూడో సీజన్..
కాగా 31 ఏళ్ల కమ్మిన్స్ ఐపీఎల్ 2024లో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఆ సీజన్ మెగా వేలంలో అతడిని రూ.20.50 కోట్ల భారీ ధరకు ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, 2023 ODI ప్రపంచ కప్‌లో ఆసీస్‌ను కమ్మిన్స్ విజేతగా నిలపడంతో తమ జట్టు పగ్గాలను కమ్మిన్స్‌కు ఎస్ఆర్‌హెచ్ అప్పగించింది.
కెప్టెన్‌గా తన అరంగేట్ర సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్‌ను ఫైనల్ వరకు కమ్మిన్స్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. అయినప్పటికి మరోసారి కమ్మిన్స్‌పై ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం మరోసారి నమ్మకం ఉంచింది. ఇక ఐపీఎల్-2026 వేలానికి ముందు సన్‌రైజర్స్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ(రూ.10 కోట్లు)ని లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ చేసింది. స్టార్ స్పిన్నర్లు ఆడమ్ జంపా, రాహుల్ చాహర్‌లను కూడా సన్‌రైజర్స్ విడుదల చేసింది.
ఎస్‌ఆర్‌హెచ్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే..
పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్. స్మరన్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ, జీషన్ అన్సారీ.
చదవండి: IND vs PAK: పాక్‌తో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం


