కీలక మ్యాచ్‌.. గెలిస్తేనే నాకౌట్‌కు; కళ్లన్నీ రొనాల్డోపైనే! | Crucial Match For-Portugal Vs Uzbekistan-Cristiano Ronaldo In Focus | Sakshi
Sakshi News home page

FIFA WC 2026: కీలక మ్యాచ్‌.. గెలిస్తేనే నాకౌట్‌కు; కళ్లన్నీ రొనాల్డోపైనే!

Jun 23 2026 1:48 PM | Updated on Jun 23 2026 1:56 PM

Crucial Match For-Portugal Vs Uzbekistan-Cristiano Ronaldo In Focus

ఫిఫా ప్రపంచకప్‌లో 12వ రోజు ముగ్గురు స్టార్ ఆటగాళ్లు అదరగొట్టారు. మెస్సీ (అర్జెంటీనా), ఎంబాపె (ఫ్రాన్స్‌), ఎర్లింగ్ హాలండ్ (నార్వే) ఇవాళ డబుల్ గోల్స్‌తో మెరిశారు. అంతేకాదు తమ గోల్స్‌తో  జట్లు నాకౌట్ చేరడంలోనూ కీలకపాత్ర పోషించారు. అయితే రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్ ఆడుతున్న పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మాత్రం గోల్స్ ఖాతా తెరవలేదు. 

కాంగోతో మ్యాచ్‌లో గోల్ కొట్టడంలో విఫలమైన రొనాల్డో తన ఆటతోనూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తన సహచరులంతా గోల్స్ వేటలో పోటీ పడుతుండడంతో ప్రపంచంలోనే ఎక్కువ పాపులారిటీ కలిగిన రొనాల్డోపై భారీ అంచనాలుంటాయి. కాంగోతో మ్యాచ్‌లో ఆ మ్యాజిక్ మిస్ అయినప్పటికీ నేడు ఉజ్బెకిస్తాన్‌తో మ్యాచ్‌లో రొనాల్డో గోల్స్ వర్షం కురిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.  

అంతేకాదు ఉజ్బెకిస్తాన్‌తో మ్యాచ్ పోర్చుగల్‌కు చాలా కీలకం. చిన్న జట్టు కాంగోతో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న పోర్చుగల్ నాకౌట్ దశకు చేరాలంటే ఉజ్బెకిస్తాన్‌పై విజయం తప్పనిసరి. అయితే మ్యాచ్‌లో పోర్చుగల్ ఫెవరెట్‌గా కనిపిస్తున్నప్పటికీ, ఉజ్బెకిస్తాన్‌ను తక్కువ అంచనా వేయడం మొదటికే పొరపాటు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి చిన్నజట్లు సంచలనాలు నమోదు చేస్తున్నాయి. కురాకావో, కేప్ వర్డె వంటి పసికూనలు పెద్ద జట్లను వణికించాయి. 

Read: ఐర్లాండ్ బ‌య‌ల్దేరిన టీమిండియా.. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా వైభ‌వ్!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement