సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన క్రికెట్‌ సౌతాఫ్రికా | Cricket South Africa Announced Central Contracts For 2024 25 | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన క్రికెట్‌ సౌతాఫ్రికా

Mar 27 2024 6:24 PM | Updated on Mar 27 2024 7:08 PM

Cricket South Africa Announced Central Contracts For 2024 25 - Sakshi

2024-25 సంవత్సరానికి గాను సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందిన ఆటగాళ్ల జాబితాను క్రికెట్‌ సౌతాఫ్రికా ఇవాళ ప్రకటించింది. ఈ జాబితాలో స్టార్‌ పేసర్‌ అన్రిచ్‌ నోర్జే పేరు కనిపించలేదు. గతేడాది కాలంలో నోర్జే జాతీయ జట్టుకు అడపాదడపా ప్రాతినిథ్యం వహించడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. సౌతాఫ్రికా గతేడాదికాలంలో అన్ని ఫార్మాట్లలో కలిపి 37 మ్యాచ్‌లు ఆడగా.. నోర్జే కేవలం తొమ్మిది మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు.

సీఎస్‌ఏ సెంట్రల్‌ కాంట్రాక్‌ లిస్ట్‌లో నోర్జే పేరుతో పాటు సిసండ మగాల, వేన్‌ పార్నెల్‌, కీగన్‌ పీటర్సన్‌ పేర్లు కూడా కనిపించలేదు. ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించిన టెస్ట్‌ కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌, టీ20లకు మాత్రమే పరిమతమైన క్వింటన్‌ డికాక్‌ పేర్లను సైతం సీఎస్‌ఏ అధికారులు తొలగించారు. కొత్తగా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆశించిన కైల్‌ వెర్రిన్‌, డేవిడ్‌ బెడింగ్హమ్‌లకు మొండిచెయ్యి ఎదురైంది.

పేస్‌ బౌలర్‌ నండ్రే బర్గర్‌, ఓపెనింగ్‌ బ్యాటర్‌ టోనీ డి జోర్జీ కొత్తగా కాంట్రాక్ట్‌ దక్కించుకోగా.. అండీల్‌ ఫెహ్లుక్వాయో ఏడాది గ్యాప్‌ తర్వాత తిరిగి కాంట్రాక్ట్‌ను పొందాడు. గతేడాది మొత్తం 20 మంది సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందగా.. ఈ ఏడాది ఆ సంఖ్యను 18కే కుదించారు.

మహిళల విషయానికొస్తే.. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందిన ప్లేయర్స్‌ సంఖ్య 15 నుంచి 16కు పెరిగింది. ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించిన షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోగా.. కొత్తగా అయండ హ్లుబి, ఎలిజ్‌-మారి మార్క్స్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకున్నారు. 

2024-25 సంవత్సరానికి గాను సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందిన సౌతాఫ్రికా పురుష క్రికెటర్లు..
టెంబా బవుమా, నండ్రే బర్గర్, గెరాల్డ్‌ కొయెట్జీ, టోనీ డి జోర్జి, జోర్న్‌ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్‌, మార్కో జన్సెన్, హెన్రిచ్‌ క్లాసెన్, కేశవ్‌ మహరాజ్, ఎయిడెన్‌ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, ఆండీల్‌ ఫెహ్లుక్వాయో, కగిసో రబాడ, ర్యాన్‌ రికెల్టన్, తబ్రేజ్‌ షంషి, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్‌ డెర్ డస్సెన్

సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందిన మహిళా క్రికెటర్లు..
అన్నేకే బోష్, తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, లారా గుడాల్, అయాండా హ్లూబి, సినాలో జాఫ్తా, మారిజన్‌ కప్‌, అయాబొంగా ఖాకా, మసాబాటా క్లాస్, సున్‌ లూస్, ఎలిజ్-మారీ మార్క్స్, నోంకులులేకో మ్లాబా, తుమీ సెఖుఖునే, క్లో ట్రైయాన్‌, డెల్మి టక్కర్‌, లారా వోల్వార్డ్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement