ఐపీఎల్‌లో అదరగొట్టాడు.. టీమిండియాలో నో ఛాన్స్‌.. పాపం ధావన్‌..! | BCCI Selection Committee Trolled After-Shikhar Dhawan was not picked South Africa Series | Sakshi
Sakshi News home page

IND vs SA: ఐపీఎల్‌లో అదరగొట్టాడు.. టీమిండియాలో నో ఛాన్స్‌.. పాపం ధావన్‌..!

May 22 2022 7:31 PM | Updated on May 22 2022 7:44 PM

BCCI Selection Committee Trolled After-Shikhar Dhawan was not picked South Africa Series - Sakshi

శిఖర్‌ ధావన్‌

టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు సెలెక్టర్లు మరోసారి మొండి చేయి చూపించారు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో ధావన్‌కు చోటు దక్కలేదు. అయితే ఐపీఎల్‌-2022లో అద్భతంగా రాణించిన ధావన్‌కు చోటు దక్కకపోవడంపై సెలెక్షన్‌ కమిటీపై నెటిజన్లు మండిపడుతున్నారు."ధావన్‌ మంచి ఫామ్‌లో ఉన్న, ఫామ్‌లో లేని వెంకటేశ్‌ అయ్యర్‌ వంటి వారికి చోటు ఇస్తారా..?" అని నెటిజన్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన ధావన్‌ 421 పరుగులు సాధించి.. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. ఇక దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ జట్టులో ఐపీఎల్‌లో అదరగొట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌, పంజాబ్‌ పేసర్‌ ఆర్షదీప్‌ సింగ్‌కు చోటు దక్కింది. అదే విధంగా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ దినేష్‌ కార్తీక్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.

చదవండి: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌.. ఉమ్రాన్‌, డీకేలకు అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement