భార‌త్‌-ఇంగ్లండ్ వ‌న్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్‌, జ‌ట్లు తదితర వివరాలు ఇవే | All you need to know about India Women vs England Women series | Sakshi
Sakshi News home page

భార‌త్‌-ఇంగ్లండ్ వ‌న్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్‌, జ‌ట్లు తదితర వివరాలు ఇవే

Jun 27 2025 8:01 AM | Updated on Jun 27 2025 8:32 AM

All you need to know about India Women vs England Women series

భార‌త పురుష‌ల క్రికెట్‌ జ‌ట్టుతో పాటు మ‌హిళ‌ల జ‌ట్టు కూడా ప్ర‌స్తుతం ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉంది. ఈ టూర్‌లో భాగంగా హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్  బృందం ఇంగ్లండ్ మహిళల జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ వైట్‌బాల్ సిరీస్‌ల కోసం భారత మహిళల జట్టు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంది.

ప్రాక్టీస్ ‍గేమ్స్‌లో ఓటమి పాలైనప్పటికి ప్రధాన మ్యాచ్‌లలో మాత్రం సత్తాచాటాలని ఉమెన్ ఇన్ బ్లూ భావిస్తోంది. జూన్ 28 నుంచి జూలై 22 వరకు హర్మాన్ సేన పర్యటించనుంది. ఈ క్రమంలో భారత్‌-ఇంగ్లండ్ వైట్‌బాల్ సిరీస్‌లకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుంది.

టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలుత ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 జూన్ 28న నాటింగ్‌హామ్ వేదికగా జరగనుంది.
👉తొలి టీ20- శనివారం, జూన్ 28- నాటింగ్‌హామ్‌- రాత్రి 7 గంటలకు ఆరంభం
👉రెండో టీ20- మంగళవారం, జూలై 1- బ్రిస్టల్‌- రాత్రి 11 గంటలకు ఆరంభం
👉మూడో టీ20- శుక్రవారం, జూలై 4-ది ఓవల్‌- రాత్రి 11:05 గంట‌ల‌కు ఆరంభం
👉నాలుగో టీ20- బుధ‌వారం, జూలై 9- మాంచెస్ట‌ర్‌- రాత్రి  11 గంటలకు ఆరంభం
👉ఐదో టీ20- శ‌నివారం, జూలై 12- బ‌ర్మింగ్‌హామ్‌- రాత్రి  11:05 గంట‌ల‌కు ఆరంభం

వన్డే సిరీస్ షెడ్యూల్‌
👉మొదటి వన్డే – బుధవారం, జూలై 16 – సౌతాంప్టన్ – సాయంత్రం 5:30 గంట‌ల‌కు ఆరంభం
👉రెండవ వన్డే – శనివారం, జూలై 19 – లార్డ్స్ – మధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు ఆరంభం
👉మూడవ వన్డే – మంగళవారం, జూలై 22 – చెస్టర్-లె-స్ట్రీట్ – సాయంత్రం 5:30 గంట‌ల‌కు ఆరంభం

భారత మహిళల టీ20 జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌), షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), యాస్తికా భాటియా), హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.

భారత మహిళల వ‌న్డే జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా (వికెట్ కీప‌ర్‌), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే

ఇంగ్లండ్ టీ20 జట్టు
నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్‌), ఎమ్ అర్లాట్, టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, ఆలిస్ కాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్ (వికెట్ కీప‌ర్‌), పైజ్ స్కోల్ఫీల్డ్, లిన్సే స్మిత్, డానీ వ్యాట్-హాడ్జ్, ఇస్సీ వాంగ్.
👉ఇంగ్లండ్ ఇంకా త‌మ వ‌న్డే జ‌ట్టును ప్ర‌క‌టించ‌లేదు.

👉ఇక ఈ సిరీస్‌ల‌కు సంబంధించిన ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వ‌ర్క్‌తో పాటు ఫ్యాన్ కోడ్ యాప్‌లో వీక్షించ‌వ‌చ్చు.
 

Advertisement
 
Advertisement
Advertisement