చరిత్ర సృష్టించిన హర్మన్‌ ప్రీత్‌.. మిథాలీ ఆల్‌టైమ్‌ రికార్డ్‌ బ్రేక్‌ | Harmanpreet Kaur Goes Past Mithali Raj In Elite India Record With Century vs Zimbabwe | Sakshi
Sakshi News home page

IND vs ZIM: చరిత్ర సృష్టించిన హర్మన్‌ ప్రీత్‌.. మిథాలీ ఆల్‌టైమ్‌ రికార్డ్‌ బ్రేక్‌

Oct 25 2026 8:10 PM | Updated on Oct 25 2026 8:10 PM

Harmanpreet Kaur Goes Past Mithali Raj In Elite India Record With Century vs Zimbabwe

వ‌డోద‌ర వేదిక‌గా జింబాబ్వే మ‌హిళ‌ల జ‌ట్టుతో జ‌రుగుతున్న రెండో వ‌న్డే మ్యాచ్‌లో  భారత సీనియర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది.  కెప్టెన్ స్మృతి మంధాన, షఫాలీ వర్మ వెంటవెంటే ఔట్ కావ‌డంతో టీమిండియా కేవ‌లం 19 ప‌రుగులకే 2 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

ఈ స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన హ‌ర్మ‌న్ బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దింది.  ఓపెనర్ ప్రతీకా రావల్ (61)తో కలిసి మూడో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ క్ర‌మంలో హ‌ర్మ‌న్ కేవ‌లం 101 బంతుల్లో త‌న 8వ వ‌న్డే సెంచ‌రీ మార్క్‌ను అందుకుంది. ఓవ‌రాల్‌గా 121 బంతులు ఎదుర్కొన్న హ‌ర్మ‌న్‌.. 15 ఫోర్ల సాయంతో 126 ప‌రుగులు చేసింది.

మిథాలీ రాజ్ రికార్డు బ్రేక్‌
ఈ సెంచ‌రీతో హ‌ర్మ‌న్‌ప్రీత్ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకుంది. మ‌హిళ‌ల వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన భార‌త ఆట‌గాళ్ల జాబితాలో రెండో స్ధానానికి హ‌ర్మ‌న్ చేరింది. ఇంత‌క‌ముందు ఈ రికార్డు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(7) పేరిట ఉండేది. తాజా సెంచ‌రీతో మిథాలీని హ‌ర్మ‌న్ అధిగ‌మించింది. ఈ జాబితాలో ప్ర‌స్తుత కెప్టెన్ స్మృతి మంధాన(14) అగ్రస్ధానంలో ఉంది.

భారత మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీలు

స్మృతి మంధాన – 14 సెంచరీలు   
హర్మన్‌ప్రీత్ కౌర్ – 8 సెంచరీలు   
మిథాలీ రాజ్ – 7 సెంచరీలు
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement