
భువనేశ్వర్: ఢిల్లీ బాలుడు అరుదైన ఘనతకెక్కాడు. తొమ్మిదేళ్ల ఆరిత్ కపిల్ అమెరికా గ్రాండ్‌మాస్టర్ రాసెట్ జియత్‌దినొవ్‌ను కంగుతినిపించాడు. తద్వారా ఓ గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన అతిపిన్న భారతీయుడిగా ఘనత వహించాడు. కేఐఐటీ ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నమెంట్‌లో సోమవారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌లో ఆరిత్ కపిల్... 66 ఏళ్ల జియత్‌దినోవ్‌ను కంగుతినిపించాడు. ఆరిత్ వయసు 9 ఏళ్ల 2 నెలల 18 రోజులు మాత్రమే! నిండా పదేళ్లు కూడా లేని ఈ బాలుడు 63 ఎత్తుల పాటు సాగిన క్లాసికల్ ఈవెంట్‌లో మేటి గ్రాండ్‌మాస్టర్‌కు షాకిచ్చాడు.