వట్‌పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. అధికారులు మూడు గంటల పాటు ప్రజల నుంచి వచ్చే దరఖాస్తుల కోసం ఎదురుచూసినప్పటికీ ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం. దీంతో పాటుగా ప్రజావాణి కార్యక్రమానికి పలు శాఖల అధికారులు గైర్హజరు కావడంపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి.
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: అదనపు కలెక్టర్ పాండు
ప్రజావాణిలో వచ్చిన ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించరాదని అదనపు కలెక్టర్ పాండు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించారు. కాగా, అందోల్‌లో ఒక్క ఫిర్యాదు వచ్చినట్లు పాండు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


