లింగాకర్షక బుట్టలతో ప్రయోజనం | - | Sakshi
Sakshi News home page

లింగాకర్షక బుట్టలతో ప్రయోజనం

Aug 5 2026 8:45 AM | Updated on Aug 5 2026 8:45 AM

మల్లారెడ్డి వ్యవసాయ విద్యార్థులు

మల్లారెడ్డి వ్యవసాయ విద్యార్థులు

కౌడిపల్లి(నర్సాపూర్‌): పంటపొలంలో కాండం తొలుచుపురుగు ఇతర పురుగుల ఉధృతిని తగ్గించేందుకు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని మల్లారెడ్డి వ్యవసాయ కళాశాల విద్యార్థులు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని తునికి కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్‌ పర్యవేక్షణలో రాయిలాపూర్‌లో రైతు రాంరెడ్డి పొలంలో లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. లింగాకర్షక బుట్టలు మగ పురుగులను ఆకర్షించడం వల్ల అందులో పడి చనిపోతాయని చెప్పారు. దీంతో పురుగుల ఉధృతిని గుర్తించడం వల్ల సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ఖైరున్‌, మహాలక్ష్మి, యాసిన్‌, పావని, నవ్య, కావ్య, పూజిత, ఈషా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement