మిరుదొడ్డి(దుబ్బాక): ఉమ్మడి మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సీనియర్ జిల్లా జట్లను బీహెచ్‌ఈఎల్ ఓల్డ్ ఎంఐజీ గ్రౌండ్‌లో ఎంపిక చేసినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరయ్య తెలిపారు. మంగళవా రం మిరుదొడ్డిలో ఆయన మాట్లాడుతూ.. పురుషు ల జట్టులో రవితేజ, చైతన్య, పరితోష్ కుమార్, కృష్ణ సాయి, భరత్, రాజ్, భార్గవ్, ఉదయ్‌కుమార్, పవన్‌కల్యాణ్, శశాంక్ దేవ్, హర్షిత్ ఎంపికయ్యారని పేర్కొన్నారు. మహిళా జట్టులో రాధిక, భవాని, గా యత్రి, శ్రీలక్ష్మి, సిరి, రాధిక, అనిత, సత్య, ఈక్షిత, శ్రీ వైష్ణవి ఎంపికై నట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎంపికై న జట్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగే రాష్ట్ర స్థాయి సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ చాంపి యన్ షిప్ టోర్నమెంట్‌లో పాల్గొంటాయని తెలిపారు.


