ఆయిల్‌పామ్ లక్ష్యం..
నిజాంపేట(మెదక్): ఈ ఏడాది 25 వందల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు అయ్యేలా లక్ష్యం పెట్టుకున్నామని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని చల్మెడలో సాగవుతున్న ఆయిల్‌పామ్ పంటను సందర్శించిన అనంతరం ఆమె మాట్లాడారు. 2023లో పెట్టిన వాటికి పంట తీస్తున్నారని, పామాయిల్ సాగు చేసిన రైతులకు మూడేళ్ల తరువాత మంచి ఆదాయం వస్తుందన్నారు. ఈ మేరకు పంట సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం అందుతుందని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఇతర పంటలు సాగు చేస్తే మంచి లాభాలు గడించవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్, హార్టికల్చర్ అధికారి ప్రతాప్‌సింగ్, ఏడీఏ విన్సెంట్ వినయ్, వ్యవసాయ అధికారులు సోమశేఖర్‌రెడ్డి, ప్రవీణ్, యాదగిరి, వందన, ఏఈవోలు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతిమా సింగ్


