
నానో యూరియాపై అవగాహన
కంది(సంగారెడ్డి: నానో యూరియాతో అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటలక్ష్మి సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని కాశీపూర్లో రసాయనిక మందులు ఎరువుల దుకాణాలను తనిఖీ చేయడంతోపాటు నానో యూరియా వాడకంపై అవగాహన రైతులకు కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లీటరు నానో యూరియా బస్తా యూరియాతో సమానమని తెలిపారు. కాగా, ప్రస్తుతం మండలంలో 60 మెట్రిక్ టన్నుల యూరియా 45 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీ..
రాయికోడ్(అందోల్): మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి సారిక, ఎస్‌ఐ చైతన్య కిరణ్‌తో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భగంగా పురుగు మందులను పరిశీలించి ఎరువుల స్టాక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎరువులు, పురుగుమందులను ఎమ్మార్పీలకే ధరలకే విక్రయించాలన్నారు. అనంతరం ఆయా దుకాణాల్లో విక్రయించిన ఎరువులు, పురుగు మందుల వివరాలను తెలుసుకుని రిజిస్టర్లను తనిఖీ చేశారు.