
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం
సంగారెడ్డి టౌన్: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనుల జాతర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఇరిగిపల్లిలో పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదగిరి, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
చేర్యాలలో భూమి పూజ..
కంది(సంగారెడ్డి): మండల పరిధిలోని చేర్యాలలో శుక్రవారం అంగన్‌వాడీ భవనం, ఏర్దనూర్ తండాలో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణం పనులకు టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను విడతల వారీగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రనాయక్, నాయకులు ఆంజనేయులు, మోతిలాల్ నాయక్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి