ఉపాధి హామీ పనులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఉపాధి హామీ పనులు ప్రారంభం

Aug 23 2025 6:21 AM | Updated on Aug 23 2025 6:21 AM

ఉపాధి

ఉపాధి హామీ పనులు ప్రారంభం

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనుల జాతర కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం అన్ని గ్రామ పంచాయతీల్లో అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉపాధి హమీ పనులను ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంపీడీఓ శ్రీనివాస్‌, ఏపీఓ రంగారవు పాల్గొన్నారు.

వట్‌పల్లి(అందోల్‌): ఉపాధి పనుల జాతరలో భాగంగా అందోల్‌ మండలంలోని నేరడిగుంట, రోళ్లపాడ్‌, చింతకుంట, కన్‌సాన్‌పల్లి, కోడెకల్‌, సంగుపేట, వట్‌పల్లి మండలంలోని బిజిలీపూర్‌ గ్రామాల్లో శుక్రవారం గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓలు అంజయ్య, రాజేశ్‌కుమార్‌, ఎంపీఓ సోమ్‌నారాయణ, ఏపీఓ అర్చన పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రిక ఆవిష్కరణ

పటాన్‌చెరు: వినాయక చవితి సందర్భంగా ఈనెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 6వ తేదీ వరకు రుద్రారం గ్రామ పరిధిలోని గణేష్‌ గడ్డ సిద్ధి వినాయక దేవాలయంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి లావణ్య, జూనియర్‌ అసిస్టెంట్‌ ఈశ్వర్‌, ఆలయ అర్చకులు సంతోష్‌ జోషి, చంద్రశేఖర్‌, జగదీశ్వర్‌ స్వామి, అయ్యప్ప, సతీష్‌, మాజీ సర్పంచులు సుధీర్‌ రెడ్డి, వెంకన్న పాల్గొన్నారు.

విద్యార్థులకు సహకారం

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బీదర్‌ ద్వారకా ఆస్పత్రి వైద్యుడు సందీప్‌ సూచించారు. ఈ మేరకు మిర్జాపూర్‌(బి)లోని జెడ్పీహెచ్‌ఎస్‌లో చదువుతున్న 312 మంది విద్యార్థులకు సొంత ఖర్చులతో ఐడీ కార్డులు, బెల్టులు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం రాజ్‌కుమార్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు మరమ్మతులు

పుల్‌కల్‌(అందోల్‌): మండల పరిధిలోని పెద్దారెడ్డిపేట చౌరస్తా నుంచి గ్రామానికి వెళ్లే రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. ఈ మేరకు గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు కుమ్మరి లింగన్న ఉచితంగా పూడ్చివేసి ఔదార్యం చాటాడు. అలాగే గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారంగా బోరు వేయించి మోటారు బిగించారు. దీంతో గ్రామస్తులు ప్రశంసించారు.

పనుల జాతరలో భూమి పూజ

జహీరాబాద్‌ టౌన్‌: మండలంలోని అనేగుంటలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా పరిషత్‌ సీఈఓ జానకిరెడ్డి అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ మేరకు పశువుల పాక, కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణానికి పూజలు చేసి శంస్థాపన చేశారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు పూజలు నిర్వహించిన అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ జ్యోతి, మండల ప్రత్యేక అధికారి, వ్యవసాయశాఖ ఏడీఏ. భిక్షపతి, డిప్యూటీ ఈఈ, రామచందర్‌, ఎంపీడీఓ మహేందర్‌రెడ్డి, ఏపీఓ అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ పనులు ప్రారంభం  
1
1/4

ఉపాధి హామీ పనులు ప్రారంభం

ఉపాధి హామీ పనులు ప్రారంభం  
2
2/4

ఉపాధి హామీ పనులు ప్రారంభం

ఉపాధి హామీ పనులు ప్రారంభం  
3
3/4

ఉపాధి హామీ పనులు ప్రారంభం

ఉపాధి హామీ పనులు ప్రారంభం  
4
4/4

ఉపాధి హామీ పనులు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement