
సాగుకు అనుబంధంగా ఉపాధి పనులు
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: ఉపాధి హామీ పథకం గ్రామాల అభివృద్ధికి, వ్యవసాయ అనుబంధానికి ఉపయోగించడం జరుగుతుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఖేడ్ మండలంలోని మాధ్వార్, లింగనాయక్‌పల్లి, నిజాంపేట్ మండలం నాగ్‌ధర్ గ్రామాల్లో పనుల జాతరలోభాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ...గ్రామాల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు నిర్మాణాలు పూర్తి చేసుకోవాలన్నారు. రెండు, మూడో విడతల్లోనూ అర్హులకు ఇళ్లను మంజూరు చేస్తారని తెలిపారు.