
ఫిల్టర్ బెడ్ ఆధునీకరణ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణానికి తాగునీటిని సరఫరా చేస్తున్న ఫిల్టర్‌బెడ్‌లో పాత యంత్రాల స్థానే అధునాతనమైన సాంకేతికతతో కూడిన కొత్త యంత్రాలను అమర్చనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ తాగునీరు పూర్తిస్థాయిలో శుద్ధి కాకపోతుండటంతో నీళ్లు వాసన వస్తున్నాయన్నారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డితో కలిసి శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ పి.ప్రావీణ్యతో పట్టణంలోని అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ... ఈ ఫిల్టర్ బెడ్ నిర్వహణను సమర్థవంతమైన ఏజెన్సీకి అప్పగించాలన్నారు. యంత్రాల కొనుగోలుకు అంచనాలను సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య, మున్సిపల్, పబ్లిక్‌హెల్త్ అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ఫిల్టర్ బెడ్ నిర్వహణ కోసం టెండరు ప్రక్రియను ప్రారంభించాలని, ఇందుకోసం న్యాక్ ఇంజనీర్‌ను నియమించాలని పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సహకారంతోనే 2004లో ఈ తాగునీటి పథకం మంజూరు చేయించానని జగ్గారెడ్డి గుర్తు చేశారు. అంతకుముందు పట్టణంలో తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు. రాజంపేట నుంచి హాస్టల్‌గడ్డ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్లు, రాజీవ్‌పార్కు అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరు చేసేందుకు మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అంగీకరించినట్లు తెలిపారు.
కలెక్టర్ ప్రావీణ్యతో చర్చించిన జగ్గారెడ్డి
ఈ తాగునీటి పథకాన్ని వైఎస్‌ఆర్
మంజూరు చేశారని వ్యాఖ్య