
ప్రజా సమస్యలపై ఉద్యమిస్తాం
ఎమ్మెల్సీ అంజిరెడ్డి
రామచంద్రాపురం (పటాన్‌చెరు): ప్రజా సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో స్రెకటేరియట్ ముట్టడిలోభాగంగా రామచంద్రాపురం పోలీసులు ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు సి.గోదావరిలను తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో బీజేపీ నాయకులను గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ నేటికీ ఆ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలను అమలు చేయాలని, హైదరాబాద్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే గృహ నిర్బంధం చేయడమేమిటని ప్రశ్నించారు.
గ్రామాల అభివృద్ధికి కృషి
టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ముబారక్ పూర్(బి) గ్రామంలో పంచాయతీ భవన నిర్మాణానికి శుక్రవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, రూ.500లకే గ్యాస్‌సిలిండర్, 200 వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ ప్రభు, మండల అధ్యక్షుడు సిద్దన్న, ఎంపీడీఓ లక్ష్మి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల పట్ల
శ్రద్ధ వహించాలి: సౌజన్య
సంగారెడ్డి టౌన్: విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని శిశు గృహం, సఖీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు న్యాయసేవల విషయంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
నిర్మాణ పనులు వేగవంతం
జహీరాబాద్ టౌన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపనులు వేగవంతంగా చేయాలని లబ్ధిదారులకు హౌజింగ్ పీడీ చలపతిరావు సూచించారు. మొగుడంపల్లి మండలం ఉప్పర్‌పల్లి తండాను శుక్రవారం ఆయన సందర్శించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఇళ్లు నిర్మించుకుంటున్న వారిని కలిసి వారితో ఆయన మాట్లాడారు. ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి దశల వారీగా బిల్లులు విడుదల చేస్తామన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అనంతరం ఆయన మొగుడంపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించారు. ఆయన వెంట ఎంపీడీఓ మహేశ్ తదితరులున్నారు.

ప్రజా సమస్యలపై ఉద్యమిస్తాం

ప్రజా సమస్యలపై ఉద్యమిస్తాం