
గోవా మద్యం పట్టివేత
ఇద్దరి అరెస్టు
జహీరాబాద్ టౌన్: గోవా నుంచి అక్రమంగా తీసుకొస్తున్న మద్యం బాటిళ్లను గురువారం ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. జిల్లా సూపరింటెండెంట్ నవీన్‌చంద్ర ఆదేశాల మేరకు మండలంలోని చిరాగ్‌పల్లి చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నల్గొండకు చెందిన నవీన్, మురళీలు ట్రావెల్స్ బస్సులో మద్యం తీసుకొస్తుండగా పట్టుకున్నారు. ఈ మేరకు వారి నుంచి వివిధ రకాల బ్రాండ్స్‌కు చెందన 37 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసు కుని ఇద్దరిని అరెస్టు చేశారు. అనంతరం స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను స్థానిక ఎకై ్సజ్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. తనిఖీల్లో ఎస్‌ఐ ఉమారాణి, హెచ్‌సీ కిషన్ కాని స్టేబుళ్లు అంజిరెడ్డి, వంశీ, శివ పాల్గొన్నారు.