గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

Aug 22 2025 6:47 AM | Updated on Aug 22 2025 6:47 AM

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

పటాన్‌చెరు టౌన్‌: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ మహేశ్వర్‌ రెడ్డి తెలిపారు. ఇస్నాపూర్‌ చౌరస్తాలో ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు సీఐ వినాయక్‌ రెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామని ఎస్‌ఐ తెలిపారు. ఈ తనిఖీలో మేడ్చల్‌ జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన ఎరుకలి అరుణ్‌ని అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం నిందితుడి నుంచి 100 గ్రాముల గంజాయి, సెల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎక్కడైనా గంజాయి విక్రయించినట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు ఆసిఫ్‌ అలీ, అభిమాని సింగ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

రిమాండ్‌కు తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement