
గేమ్ ఓవర్!
సాక్షి, సిద్దిపేట: ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్–2025 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభతో పాటు రాజ్యసభల్లోనూ ఆమోదం పొందింది. ఈ మేరకు ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గేమింగ్, బెట్టింగ్‌లకు చాలా మంది యువత బానిసై ఆర్థికంగా నష్టపోయి ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అలాగే మరికొంతమంది అప్పుల పాలై పోలీసులను సైతం ఆశ్రయించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్‌లు నిషేధంలో ఉన్నప్పటికీ దొంగచాటున ప్రవేశించి యువతను బానిసలుగా మార్చాయి. తాజాగా, ఉభయ సభల్లో ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తున్నారు.

గేమ్ ఓవర్!