మత్తు పదార్థాలపై కొరడా.. జాగిలాలతో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలపై కొరడా.. జాగిలాలతో తనిఖీలు

Aug 22 2025 6:47 AM | Updated on Aug 22 2025 12:22 PM

జాగిలాలతో తనిఖీలు

మత్తు పదార్థాలపై కొరడా.. జాగిలాలతో తనిఖీలు

చిన్నశంకరంపేట(మెదక్‌): గంజాయి, డ్రగ్స్‌ వంటి నిషేధిత మత్తు పదార్థాలపై పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. ఈ మేరకు చిన్నశంకరంపేట, నార్సింగి మండల కేంద్రాల్లోని హోటళ్ల వద్ద పోలీస్‌లు డాగ్‌స్కాడ్‌ బృందంతో తనిఖీలు నిర్వహించారు. దాబాలతో పాటు హోటళ్లు, రైల్వేస్టేషన్‌, బస్డాండ్‌లలో గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తుపదర్థాలతో పాటు మద్యంను గుర్తించేందుకు జాగిలాలతో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే మిర్జాపల్లి రైల్వేస్టేషన్‌, నార్సింగి బస్టాండ్‌లలో డాగ్‌స్కాడ్‌ బృందం తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో చిన్నశంకరంపేట, నార్సింగి ఎస్‌ఐలు నారాయణగౌడ్‌, సృజర పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

హిందీ టీచర్‌కు డాక్టరేట్‌

రామాయంపేట(మెదక్‌): పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలు దోర్బల వేదశ్రీకి డాక్టరేట్‌ లభించింది. హిందీ సాహిత్యంలో ‘సామాజిక ధ్యాన్‌’ కావ్యం రూపొందించినందుకు గాను ఆమెకు ఈ అవార్డు వరించింది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్‌ చేతుల మీదుగా ఆమె డాక్టరేట్‌ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో హిందీ టీచర్‌ను తోటి ఉపాధ్యాయులు సన్మానించారు.

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

రామచంద్రాపురం(పటాన్‌చెరు): పట్టణంలోని లింగంపల్లి చౌరస్తా వద్ద తీవ్రగాయాలైన ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. లింగంపల్లి చౌరస్తాలో నూతనంగా నిర్మించిన ప్లైఓవర్‌ బ్రిడ్జి కింద ఈనెల 13న తీవ్ర గాయాలతో ఓ గుర్తు తెలియని వ్యక్తి పడి ఉన్నాడు. గమనించిన పోలీసులు వెంటనే 108 అంబులెన్స్‌లో పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు టీషార్ట్‌, ప్యాంట్‌ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతిడి వయస్సు 35నుంచి 40ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి ఎవరైన గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

రోడ్డు ప్రమాదంలో..

పటాన్‌చెరు టౌన్‌: చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇంద్రేశం నుంచి పోచారం వెళ్లే దారిలో ఈనెల 17 వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్‌ ద్వారా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, మృతుడికి సంబంధించిన బంధువులు ఉంటే పోలీసులను సంప్రదించాలన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కుంటలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

పటాన్‌చెరు టౌన్‌: అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని బంధం కొమ్ము గ్రీన్‌ విల్లాస్‌ సమీపంలోని కొచ్చెరువు కుంటలో గురువారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 ఏళ్లు ఉండవచ్చని, మృతిచెంది మూడు రోజులు కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పొలం పనులకు వెళ్లితిరిగిరాని లోకాలకు..

సిద్దిపేటఅర్బన్‌: వరి పొలంలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ఎన్సాన్‌పల్లిలో గురువారం చోటుచేసుకుంది. పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీకి చెందిన తంగళ్లపల్లి నర్సింహాచారి (50) వృత్తి రీత్యా బంగారు నగల పనిచేస్తుంటాడు. గత కొంత కాలంగా మూర్చ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 19న ఉదయం పని నిమిత్తం వెళ్తున్నానని ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. అతని కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. 

ఈ క్రమంలో ఎన్సాన్‌పల్లి గ్రామ శివారులోని ఓ వరి పొలంలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా ప్యాంట్‌ జేబులో ఉన్న ఆధార్‌ కార్డు ఆధారంగా నర్సింహాచారిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు దినేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement