
గడువులోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయండి
సిద్దిపేటకమాన్: నిర్ణీత గడువులోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ సీహెచ్ రమేష్ తెలిపారు. పట్టణంలో రైస్ మిల్లర్లు, డాక్టర్లు, పత్తి, వస్త్ర, సిమెంట్, పౌల్ట్రీ, ఇతర వర్తక సంఘాలు, వ్యాపారులతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024–25 ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు, అడ్వాన్స్ టాక్స్, మోసపూరిత రిఫండ్ క్‌లైయిమ్ చేయడంతో కలిగే పరిణామాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఐటీ రిటర్న్ దాఖలు చేయకపోవడంతో కలిగే పరిణామాలు, ఇతర అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆదాయపు పన్ను శాఖ అధికారి రమణరావు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది ప్రదీప్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఆదాయపు పన్ను శాఖ
జాయింట్ కమిషనర్ సీహెచ్ రమేష్