
సలాం జవాన్
తడ్కపల్లి జడ్పీ హైస్కూల్‌లో సన్మానం
సిద్దిపేటఅర్బన్: 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శుక్రవారం మండలంలోని ఆయా గ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తడ్కపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో దేశ రక్షణలో పాలు పంచుకున్న ఆర్మీ అధికారులు, రిటైర్డ్ ఆర్మీ జవాన్లను సన్మానించారు. కార్యక్రమంలో సుబేదార్ మేజర్ సదయ్య, సుబేదార్ కవిత్పాల్‌రెడ్డి, రిటైర్డ్ జవాన్లు స్కైలాబ్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, అశోక్, ప్రధానోపాధ్యాయుడు దేవర కనకయ్య, ఉపాధ్యాయుడు జోగు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.