
ఆలుమగల మధ్య గొడవలు
పురుగుల మందు తాగి భార్య ఆత్మహత్య
పాపన్నపేట(మెదక్): కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండల పరిధిలోని అమ్రియా తండాలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... తండాకు చెందిన లునావత్ లక్ష్మి(40)భర్త గోపాల్‌తో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కొంత కాలంగా ఆలుమగల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో మనస్తాపానికి గురైన లక్ష్మి ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగింది. వెంటనే ఆమెను మెదక్ ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది.